Begin typing your search above and press return to search.
మీ పాస్‌వర్డ్ ఎంత స్ట్రాంగ్ అనేది ఇక్కడ చూడండి
By: Tupaki Desk | 16 Nov 2021 5:00 AM ISTప్రస్తుత జనరేషన్ మొత్తం సోషల్ మీడియా అయ్యింది... అలాగే ప్రతి ఆర్థిక పరమైన విషయం కూడా ఆన్ లైన్ ద్వారానే జరిగే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఎన్నో విషయాలను ఆన్ లైన్ ద్వారా షేర్ చేసుకోవడంతో పాటు.. అత్యంత ముఖ్యమైన డేటాను కూడా ఆన్ లైన్ లో షేర్ చేస్తున్నాం.. సేవ్ చేస్తున్నాం. ఇక సోషల్ మీడియాలో కూడా వ్యక్తిగత సమాచారాన్ని పంచుకుంటూ ఉంటున్నాం. ఇలా ప్రతి విషయంలో కూడా వినియోగించే ఆన్ లైన్ సర్వీస్ కు పాస్ వర్డ్ లు మనం ఉపయోగిస్తాం. పాస్ వర్డ్ ను బ్రేక్ చేయడంకు ఇప్పుడు ఎన్నో టూల్స్ వచ్చాయి.
కొందరు హ్యాక్స్ పాస్ వర్డ్స్ ను క్షణాల్లో బ్రేక్ చేసేంతటి టెక్నాలజీని కనిపెట్టారు. ఆ టెక్నాలజీకి చిక్కకుండా ఉండాలంటే మీ పాస్ వర్డ్ లు స్ట్రాంగ్ గా ఉండాలి. చాలా మంది పాస్ వర్డ్ లు వరుస నెంబర్ లను పెడతారు.. లేదంటే ఆల్ఫాబెట్స్ ను వరుస క్రమంలో పెడతారు... కొందరు జీరోలు పెడితే మరి కొందరు మరో రకంగా అన్ని ఒకే అక్షరాలు లేదా అంకెలను పెడతారు.
పాస్ వర్డ్ ను జాగ్రత్తగా పెట్టకుంటే మాత్రం చాలా ప్రమాదం తప్పదు అంటూ ఇప్పటికే పలు సందర్బాల్లో నిరూపితం అయ్యింది. కాస్త జాగ్రత్తగా లేకుంటే మాత్రం మొత్తం అకౌంట్ ను హ్యాక్సర్ సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు పెట్టే పాస్ వర్డ్ లను బట్టి హ్యాకర్స్ వాటిని బ్రేక్ చేసే సమయం ఆధార పడి ఉంటుంది. నాలుగు అక్షరాలతో పాస్ వర్డ్ ను పెట్టడం వల్ల అస్సలు సెక్యూరిటీ ఉండదని టెక్ నిపుణులు చెబుతున్నారు.
పూర్తిగా నెంబర్స్ లేదా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ను పెట్టినా కూడా ఖచ్చితంగా హ్యాక్స్ చేతిలో బుక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీ పాస్ వర్డ్ నాలుగు అక్షరాలు లేదా అంకెల్లో ఉంటే క్షణాల్లోనే దాన్ని హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. పది అక్షరాల్లో ఉంటే కాస్త స్ట్రాంగ్ గా అనుకోవచ్చు. కాని అందులో కూడా ఇంగ్లీష్ అక్షరాలు.. నెంబర్స్ మరియు స్పెషల్ క్యారెక్టర్స్ మరియు అప్పర్ కేస్ మరియు లోయర్ కేస్ లు ఉంటేనే స్ట్రాంగ్ అంటున్నారు.
10 అక్షరాలతో నంబర్స్.. అప్పర్ కేస్ మరియు లోయర్ కేస్.. స్పెషల్ సింబల్స్ ను ఉపయోగించడం వల్ల ఆ పాస్ వర్డ్ ను బ్రేక్ చేయడం కు హ్యాకర్స్ కు 5 ఏళ్లు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎంత ఎక్కువ అక్షరాలతో పాస్ వర్డ్ ఉంటే అంత స్ట్రాంగ్.. అయితే అందులో అప్పర్ కేస్.. లోయర్ కేస్.. నెంబర్స్ మరియు స్పెషల్ సింబల్స్ ఉన్నప్పుడు మాత్రమే స్ట్రాంగ్ అంటూ నిపుణులు చెబుతున్నారు.
మీరు పైన చూస్తున్న గ్రాఫ్ లో మీ పాస్ వర్డ్ గ్రీన్ జోన్ లో ఉన్నట్లయితే పర్వాలేదు.. లేదంటే వెంటనే మార్చుకోవడం బెటర్.. గ్రీన్ జోన్ లో పాస్ వర్డ్ ఉంటే దాన్ని గుర్తు పెట్టుకోవడం కష్టమే.. కాని ఏదో ఒక విధంగా ఆ పాస్ వర్డ్ ను సేవ్ చేసుకుని ఎక్కువ సంఖ్యలో అంకెలు మరియు స్పెషల్ క్యారెక్టర్స్ తో పాస్ వర్డ్ పెట్టుకోవడం మంచిదని టెక్ నిపుణులు చెబుతున్నారు. మరెందుకు ఆలస్యం వెంటనే మీ పాస్ వర్డ్ ను స్ట్రాంగ్ చేసేసుకోండి.