Begin typing your search above and press return to search.
ఏపీ చరిత్రలో ఎప్పుడు లేని రీతిలో దేవీపట్నంలో 144వ సెక్షన్.. ఎందుకో తెలిస్తే షాకే
By: Tupaki Desk | 21 Aug 2020 12:00 PM ISTసిత్రమైన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నారు ఏపీ అధికారులు. ఇప్పటివరకు ఎప్పుడూ లేనట్లుగా తీసుకుంటున్న నిర్ణయాలు కొత్త చర్చకు తెర తీస్తున్నాయి. సాధారణంగా దేశంలో కానీ.. ఏ రాష్ట్రంలో అయినా కానీ 144 సెక్షన్ ఎప్పుడు విధిస్తారు? అల్లర్లు.. గొడవలు.. మత ఘర్షణలు.. ఎన్నికల సమయాలతో పాటు అనూహ్య మరణాలు చోటు చేసుకున్నప్పుడు ఈ సెక్షన్ ను విధిస్తుంటారు.
అలాంటిది విపత్తువేళ.. అందునా వరదలు ముంచెత్తిన వేళలో.. ఈ సెక్షన్ ను విధించటం గమనార్హం. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లుగా రంపచోడవరంఐటీడీఏ ప్రాజెక్టు అధికారి.. తూర్పుగోదావరిజిల్లా అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సీవీ ప్రవీణ ఆదిత్య ఉత్తర్వులు జారీ చేశారు.
సాధారణంగా వరదల సమయంలో వీలైనంత ఎక్కువగా సహాయక చర్యల మీద ఫోకస్ పెడుతుంటారు. అందుకు భిన్నంగా 144 సెక్షన్ విధించటం విస్మయానికి గురి చేస్తోంది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ సెక్షన్ మీడియా ప్రతినిధులకు సైతం వర్తిస్తుందని.. ఆయా ప్రాంతాల్లో పర్యటించాలంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలంటూ ఉత్తర్వులు జారీ చేయటం గమనార్హం.
సాధారణంగా విపత్తులు చోటు చేసుకున్నప్పుడు మీడియా చురుగ్గా వ్యవహరించి.. ప్రభుత్వానికి ఫీడ్ బ్యాక్ ఇస్తుంటుంది. ఏయే ప్రాంతాల్లో ఏమేం జరిగింది? సహాయక చర్యలు బాగానే జరుగుతున్నాయా? లేదా? అధికారుల తీరు ఎలా ఉంది? బాధితుల కష్టాల మాటేమిటి? ప్రభుత్వ తీసుకుంటున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయా? లేదా? అన్న వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందుకు భిన్నంగా.. మీడియా కవరేజ్ కు వెళ్లాలంటే కూడా ముందస్తుగా ఉత్తర్వులు తీసుకోవాల్సి రావటం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ఇంతకీ..144సెక్షన్ ఎందుకు విధించినట్లు? అన్న ప్రశ్నకు అధికారులు ఇస్తున్న సమాచారం మహా సిత్రంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నలుగురైదుగురు కలిస్తే ప్రమాదమని.. అందుకే.. విపత్తు వేళ.. ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి వరదల లాంటి ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు.. వీలైనంతమంది ఇన్ వాల్వ్ కావటం ద్వారా బాధితులకు ప్రయోజనం కలుగుతుంది. ఆ విషయాన్ని వదిలేసి.. ఇలాంటి పరిమితులు విధించటం సరైన పద్ధతి కాదంటున్నారు. ఈ నిర్ణయం ప్రభుత్వానికి కాకుండా. .స్థానిక అధికారులు తీసుకున్నట్లుగా కనిపించిన జగన్ సర్కారు ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుందన్న మాట వినిపిస్తోంది.