Begin typing your search above and press return to search.

మూడు ముక్కలాట:కశ్మీర్ ముక్కలు కానుందా..కేంద్రం డెసిష‌న్‌ పై స‌ప్పెన్స్‌

By:  Tupaki Desk   |   5 Aug 2019 5:29 AM GMT
మూడు ముక్కలాట:కశ్మీర్ ముక్కలు కానుందా..కేంద్రం డెసిష‌న్‌ పై స‌ప్పెన్స్‌
X
జమ్మూ & కశ్మీర్ రాష్ట్రంలో ఊహించని పరిణామాలతో హై అలెర్ట్ నడుస్తోంది. కేంద్రం ఆర్డర్ తో కశ్మీర్ భద్రత దళాల గుప్పిట్లో ఉంది. ఇప్పటికే అమర్‌ నాథ్‌ యాత్రను నిలిపివేసి - యాత్రికులను సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవాలని చెప్పేశారు. అలాగే టూరిస్టులనూ పంపేశారు. తాజాగా - శ్రీనగర్‌ లోని నిట్‌ విద్యార్థులను - క్రికెటర్లని వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు.

ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే..రాష్ట్రం మూడు ముక్కలు కానుందని...దీని మీద కేంద్రం నేడు ఓ నిర్ణయం తీసుకోబోతుందన్న వార్తలు వెలువడుతున్నాయి. దీని ప్రకారం ఇప్పటి వరకూ కలిసి ఉన్న జమ్ము - కశ్మీర్‌ రెండు రాష్ట్రాలు కానున్నాయి. అలాగే టిబెట్‌ - చైనా - గిల్గిత్ - బాల్టిస్థాన్‌ సరిహద్దులుగా కలిగిన లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతం కానుందని తెలుస్తోంది. అటు జమ్మూ కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 - 35ఏ కూడా పరోక్షంగా రద్దు కానున్నాయని సమాచారం.

అయితే పార్లమెంట్ సమావేశాలు బుధవారం జరగనున్నాయి. కాబట్టి ఈ మూడు రోజుల్లో జమ్మూ కశ్మీర్ భవితవ్యంపై ఏదొక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. దీనికి తగ్గట్టుగా నేడు ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమవుతుంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా - జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ - న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ - రక్షణ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ - ముక్తార్ అబ్బాస్ నఖ్వి తదితరులు మోదీ నివాసంలో భేటీ అవుతున్నారు.

మరి మంత్రివర్గ సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందా అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అటు ఈ పరిణామాల నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఆ వెంటనే దీనికి వ్యతిరేకంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ - ఒమర్‌ అబ్దుల్లాలను పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ నేత ఉస్మాన్ మాజిద్‌ - సీపీఎం ఎమ్మెల్యే ఎం.వై.తరిగామిలను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. చూడాలి మరి జమ్మూ కశ్మీర్ విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో ? చూడాలి.