Begin typing your search above and press return to search.
వాట్సాప్ గ్రూపుల నుంచి బయటకొచ్చి.. జగన్ సర్కారుకు సరికొత్త షాకిచ్చారు
By: Tupaki Desk | 9 Jan 2022 10:09 AM ISTఅదేం సిత్రమో కానీ.. ఒక సమస్యను పరిష్కరించామన్నంతనే.. మరో సమస్య సిద్ధమైపోవటం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అలవాటుగా మారింది. గడిచిన కొంతకాలంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారి.. ప్రభుత్వానికి తలనొప్పిగా మారటం.. వారికి సర్దిచెప్పి.. తాను అనుకున్న రీతిలో నిర్ణయాన్ని తీసుకొని.. అంతా ఓకే అనుకున్నంతలో.. ఊహించని నిరసన ఒకటి తెర మీదకు వచ్చింది.గతంలో మరే ముఖ్యమంత్రి చేయని రీతిలో.. ఏపీ వ్యాప్తంగా గ్రామ సచివాలయం అంటూ కొత్త కాన్సెప్టును తీసుకొచ్చి.. ప్రతి గ్రామంలో సచివాలయాన్ని ఏర్పాటు చేయటం.. ప్రభుత్వ పాలనలో వారికి అమితమైన ప్రాధాన్యత ఇవ్వటం తెలిసిందే.
గ్రామ సచివాలయం పుణ్యమా అని.. స్థానిక ఎమ్మెల్యేలకు సైతం పరపతి తగ్గిందన్న ఆరోపణ ఉంది. ప్రజలు ఎమ్మెల్యే కంటే కూడా గ్రామ సచివాలయ సిబ్బందికే పెద్ద పీట వేస్తున్నారని.. తమకున్న పనుల్ని వారితో చేయించుకునే అవకాశం ఉండటంతో వారికి ప్రజల్లో ప్రాధాన్యత పెరుగుతోంది. అలాంటి సచివాలయ సిబ్బంది అనూహ్యంగా జగన్ సర్కారుకు షాకిచ్చారు. కొన్ని గంటల వ్యవధిలోనే రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో గ్రామ.. వార్డు సచివాలయాల్లోని మెజార్టీ ఉద్యోగులు ఒక మాట మీదకు వచ్చేశారు. ప్రభుత్వం ఊహించిన దానికి భిన్నంగా నిరసన తెలుపుతున్నారు.
తమ డిమండ్లను పరిష్కరించటానికి ప్రభుత్వం మరింత సమయం తీసుకుంటుందన్న విషయాన్ని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రకటించటంతో వారు నిరసన చేపట్టారు. అధికారిక పనులకు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల నుంచి బయటకు వచ్చేశారు. దీంతో.. అధికారులు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సమస్యను పరిష్కరించేందుకు వారు కిందా మీదా పడుతున్న పరిస్థితి చోటుచేసుకుంది. తాము ఉద్యోగంలోకి చేరి 2021 అక్టోబరు రెండు నాటికి రెండేళ్లు అవుతున్నా.. తమకు ఇచ్చిన మాట ప్రకారం ప్రొబేషన్.. కన్ఫర్మేషన్ ప్రక్రియ పూర్తి కాకపోవటాన్ని తప్పు పడుతున్నారు.
అయితే.. ఈ విషయాన్ని ఈ ఏడాది జూన్ 30 లోగా పూర్తి చేస్తామని తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. దీనిపై వారు గుర్రుగా ఉన్నారు. దీంతో.. రోజువారీ కార్యకలాపాలకు సంబంధించిన ఆదేశాల్నిఇచ్చేందుకు.. పాలనా పరమైన అంశాలపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ పంపేందుకు వీలుగా వాట్సాప్ గ్రూపుల్ని ఏర్పాటు చేశారు. వీటికి సంయుక్త కలెక్టర్ లాంటి ఉన్నతాధికారులు ఆడ్మిన్లుగా ఉన్నారు. అయితే.. అలాంటి గ్రూపుల నుంచి సచివాలయ సిబ్బంది పెద్ద ఎత్తున ఎగ్జిట్ అయ్యారు. వాట్సాప్ గ్రూపు నుంచి ఎగ్జిట్ కావటం ద్వారా.. ప్రభుత్వం మీద అనూహ్య ఒత్తిడిని తీసుకొచ్చారు.
శనివారం ఉదయం కడప జిల్లాలో మొదలైన ఈ వినూత్న నిరసన.. గంటల వ్యవధిలోనే శ్రీకాకుళం జిల్లా వరకు అన్ని చోట్ల పాకేసింది. అధికారిక గ్రూపుల నుంచి కొన్ని గంటల వ్యవధిలోనే ఒకరి తర్వాత మరొకరు చొప్పునఅత్యధిక సంఖ్యలో బయటకు వచ్చేశారు. మరికొందరు మాత్రం.. తమకు ప్రొబేషన్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నందుకు నిరసనగా గ్రూపుల నుంచి ఎగ్జిట్ అవుతున్నట్లుగా మెసేజ్ లు పెట్టి బయటకు వచ్చారు. అనూహ్యంగా గ్రూపుల నుంచి ఒకరు తర్వాత మరొకరు ఎగ్జిట్ కావటాన్ని ఉన్నతాధికారులు అర్థం చేసుకోవటానికి కొంతసేపు పట్టిందని చెబుతున్నారు.
సచివాలయ ఉద్యోగుల్లో చాలా మంది సోమవారం నుంచి విధుల్ని బహిష్కరించి.. సమ్మె చేసే అవకాశం ఉందంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. సోమవారం నుంచి ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఓటీఎస్ పథకానికి సంబంధించిన మెగా మేళాల్ని నిర్వహిస్తున్నారు. ఇలాంటి వేళ.. సచివాలయ సిబ్బంది విధుల్ని బహిష్కరిస్తే.. ప్రోగ్రాం మొత్తం పాడవుతుందని చెబుతున్నారు. ఈ వినూత్న నిరసనపై వార్డు.. గ్రామ సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్.. తీవ్రంగా స్పందించారు.
ఎగ్జిట్ అయిన వారిని వెంటనే గ్రూపుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని.. తక్షణం విధుల్లోకి హాజరుకావాలని ఆదేశించారు. గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయి.. విధులకు హాజరు కాకుంటే.. క్రిమినల్ కేసులు తప్పవంటూ కొందరు అధికారులు హెచ్చరించినట్లుగా చెబుతున్నారు. దీంతో.. భయంతో వెనక్కి తగ్గిన సిబ్బంది కొందరు మళ్లీ గ్రూపుల్లో చేరగా.. ఎక్కువ మంది మాత్రంబయటే ఉన్నారని చెబుతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా కాక రేపుతోంది.