Begin typing your search above and press return to search.
ఉద్యోగాల పేరుతో సచివాలయ ఉద్యోగి ఘరానా మోసం
By: Tupaki Desk | 15 Dec 2020 12:49 PM ISTఏపీలో సీఎం జగన్ అద్వర్యంలోని వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాల్ని తీసుకువచ్చారు. ప్రతి ప్రభుత్వ పథకాన్ని కూడా ఇంటి గేట్ ముందుకు తీసుకురావడానికి ,నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించాలనే సత్సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగాల విప్లవాన్ని తీసుకువచ్చారు. దీని ద్వారా ఎంతోమంది నేడు ఉద్యోగస్తులుగా మారారు. అయితే సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని తీసుకువచ్చిన ఈ సచివాలయాల్లో కొందరు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు రామభద్రపురం సచివాలయంలో ఉన్నారని ప్రసారమాధ్యమాల్లో , ప్రముఖ వెబ్ సైట్స్ లో ప్రచారం అవుతుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే .. బొబ్బిలిలో ఉంటున్న తన బంధువు, విజయనగరం జిల్లాకేంద్రంలో ఓ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగితో కలిసి ముఠాగా ఏర్పడి, ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారట. అలా రామభద్రపురానికి చెందిన దాదాపు ఆరుగురు నిరుద్యోగుల నుంచి రూ.12లక్షలు వసూలు చేశారట. నిరుద్యోగులను, డబ్బులను తీసుకుని కలెక్టరేట్ వద్దకు వచ్చారు. అక్కడికి వచ్చాక ఫోన్ చేయగా లోపలి నుంచి ఒక ఉద్యోగి బయటకు వచ్చి వీరివద్ద ఉన్న డబ్బులు తీసుకుని పనైపోతుందని చెప్పి భరోసా ఇచ్చారట. దీనితో అంతా సవ్యంగానే జరుగుతుందని వీరంతా భావించారు. కానీ, డబ్బులు ఇచ్చిన తర్వాత తమకి నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారు అంటూ అడగడంతో తాత్కాలికంగా వారిని శాంతింపజేయడానికి నకిలీ అపాయింట్ మెంట్ లెటర్లు తయారు చేయాలని భావించారు. దానికి అవసరమైన సరంజామా అంతా సిద్ధం చేసి, కలెక్టర్, జిల్లా పరిషత్ సీఈఓ, ఇతర అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశారు.
ఇంకేముంది కొన్ని అధికారిక పత్రాలు రెడీ అయ్యాయి. వాటిని అభ్యర్థుల కు వాట్సప్ ద్వారా పంపించేశారట. అక్కడే ఆ ముఠా దొరికిపోయింది. ఆ పత్రాలు సోషల్‌మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. పంచాయతీరాజ్ శాఖలో పోస్టులకు సంబంధించి డబ్బులు వసూళ్లవుతున్నాయ న్న ప్రచారం మొదలైంది. దీనితో డబ్బులిచ్చిన వారిలో ఆందోళన మొదలైంది. ఇక ముఠా సభ్యులు మాత్రం ... పోలీసులను ఆశ్రయిస్తే డబ్బు లు తిరిగి ఇచ్చేది లేదని, ఉద్యోగాలు కూ డా రావని వారిని ఈ ముఠా బెదిరించింది. కష్టం చేసి , అప్పుచేసి తెచ్చిన డబ్బు జతచేసి ఇచ్చిన ఆ పేద నిరుద్యోగులు తమకు ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, ఇచ్చిన డబ్బులు వెనక్కి వస్తే చాలనుకున్నారు. దీనితో ఆ ముఠా ,పోలీసుల సాయంతో ఒక్కొక్కరికీ డబ్బులు సెటిల్ చేయడం ప్రారంభించారట. అయితే , ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులకు అక్కడి ఎంపీడీఓ ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.
ఈ వ్యవహారంలో సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు కొన్ని మిగిలిపోయాయి. అధికారిక పత్రాల్లో ఉన్న సంతకాలు ఫోర్జరీయేనా లేక నిజమైనవేనా, సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ చేసేస్తే ఇంతవరకూ ఎవరూ ఏమాత్రం పట్టించుకోకుండా ఎందుకున్నారు, జిల్లా మేజిస్ట్రేట్ సంతకాన్ని ఫోర్జరీ చేసి పత్రాలు ఇవ్వడమేగాకుండా ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసిన వారికి పోలీసులు ఎందుకు సహకరిస్తున్నారు అనేవి సమాధానాలు లేని ప్రశ్నలు. ఇంత మంది నోరునొక్కడం ఒక సచివాలయ ఉద్యోగికి సాధ్యమేనా, ఈ ఫోర్జరీ సంతకాలు ఇంకా ఎన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్నాయి., ఈ ప్రశ్నలకు సమాధాలు రావాల్సి ఉంది. ఈ ఘటన పై స్థానిక ఎస్ఐ మాట్లాడుతూ .. ఉద్యోగాల కోసం వసూళ్లు చేశారనే వార్తలు ఆధారాల్లేనివని, ఈ విషయంపై మా డీఎస్పీ ద్వారా ఎస్పీ గారు కూడా అడిగి రిపోర్టు ఇవ్వమని అడిగారు. దీంతో డబ్బులు ఇచ్చిన వారిలో ముగ్గురిని పిలిపించి విచారించాం. తాము ఎవరికీ డబ్బులు ఇవ్వలేదని వారు చెప్పారు. అదే రిపోర్టును ఉన్నతాధికారులకు పంపించాం అని అయన తెలిపారు.