Begin typing your search above and press return to search.
జగన్ పుట్టిన రోజున ఏపీలో ‘సచివాలయ దినోత్సవం’
By: Tupaki Desk | 14 Dec 2020 8:57 AM ISTఏపీ సీఎం జగన్ మానస పుత్రిక ‘సచివాలయ వ్యవస్థ’. దేశంలోనే ఇదో గొప్ప సంస్కరణ.. పాలనను రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయికి డైరెక్టుగా అందించే వ్యవస్థ. గ్రామ పరిపాలనకు కేంద్ర బిందువులుగా సచివాలయ వ్యవస్థలు ఉన్నాయి. అందుకే ఈ పథకంపై దేశవ్యాప్తంగా మేధావులు , రాజకీయ నాయకులు జగన్ పై ప్రశంసలు కురిపించారు. వేయినోళ్ల పొగిడారు. కాబోయే ఐఏఎస్, ఐపీఎస్ లకు సీఎం జగన్ ప్రవేశ పెట్టిన ‘సచివాలయ వ్యవస్థ’పై శిక్షణ కూడా ఇచ్చారంటే ఈ పథకం గొప్పతనం అర్థం చేసుకోవచ్చు.
అందుకే ఈ గొప్ప పథకాన్ని ఏపీలో పండుగలా చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు అయిన డిసెంబర్ 21న రాష్ట్ర వ్యాప్తంగా ‘సచివాలయ దినోత్సవం’గా జరుపనున్నారు.
ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘం తీర్మానించింది. అధికారంలోకి వచ్చిన కేవలం 3 నెలల్లోనే 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం అసాధారణ విషయం అని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.
2019, అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా వలంటీర్లు ప్రభుత్వ పథకాలను ప్రజలకు నేరుగా అందిస్తారు. తద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అందిస్తారు.