Begin typing your search above and press return to search.

అల్ ఖైదా టెర్రరిస్ట్ ఇంట్లో రహస్య సొరంగం !

By:  Tupaki Desk   |   21 Sept 2020 4:40 PM IST
అల్ ఖైదా టెర్రరిస్ట్ ఇంట్లో రహస్య సొరంగం !
X
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ముర్షీదాబాద్ జిల్లాలో ఆరుగురు అల్ ఖైదా టెర్రరిస్ట్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వారిలో ఒకడు .. అబూ సూఫియాన్. కాగా వారిలో అబూ సూఫీయాన్ అనే ఉగ్రవాది ఇంటిపై ఆదివారం పోలీసులు రైడ్ చేశారు. తనిఖీల్లో పోలీసులు ఆశ్చర్యపోయే విషయాలు భయటపడ్డాయి. తనిఖీల్లో ఒక రహస్యంగా ఏర్పాటు చేసిన ఛాంబర్ ను పోలీసులు గుర్తించారు. పది అడుగుల వెడల్పు, ఏడు అడుగుల ఎత్తయిన ఈ ఛాంబర్ లో ఎలక్ట్రానిక్ వస్తువులు, బల్బ్ తో కూడిన ఓ స్విచ్ బోర్డును వారు కనుగొన్నారు.

అయితే వారు దీనిపై అడిగిన ప్రశ్నలకు అబూ భార్య సమాధానం చెప్పేందుకు తత్తరపడినా, ఆ తరువాత మీడియాకు అసలు విషయం చెప్పింది. మీడియాతో మాత్రం అది తాము సెప్టిక్ ట్యాంక్ కట్టేందుకు ఏర్పాటు చేసుకున్నామని చెప్పుకొచ్చింది. దాంతో మరి రహస్యంగా ఎందుకు కట్టారని ప్రశ్నించగా ఆమె నీళ్లు మింగింది. ఇదిలా ఉండగా పట్టుబడిన ఆరుగురు ఉగ్రవాదులను ఢిల్లీ లోని పాటియాల హౌస్ కోర్టులో పోలీసులు హాజరు పర్చనున్నారు. కాగా, ఈ ఆరుగురు టెర్రరిస్టులను ఇక ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. కేరళలోని ఎర్నాకుళంలో ముగ్గురు ఆల్ ఖైదా టెర్రరిస్టులు పట్టుబడిన విషయం తెలిసిందే.