వారు వందేళ్లు బతకడం వెనుక రహస్యం ఏంటి...??

Mon Nov 29 2021 09:28:16 GMT+0530 (IST)

secret behind them living for hundreds of years

మనం చనిపోవడానికి ముఖ్య కారణాలు రెండు వాటిలో ఒకటి సహజ మరణం అయితే మరొకటి ప్రమాదం. సహజ మరణం అంటే ఏమిటి సాధారణంగా నిద్రలో కానీ లేక అనారోగ్యం బారిన పడి చనిపోవడం. లేకపోతే ఏదో ఒక వ్యాధి కారణంగా కన్నుమూయడం. ఇవన్నీ సహజ మరణాలు. మరొకటి ప్రమాదం. ఏదైనా ఒక ఘటన అకస్మాత్తుగా జరగడం వల్ల చనిపోతే దానిని ప్రమాదంగా పరిగణిస్తాము.ముఖ్యంగా రోడ్డు యాక్సిడెంట్ల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ రెండింటికీ చాలా వ్యత్యాసాలున్నాయి. సాధారణంగా సహజ మరణాలు అనేవి కొంత వయసు వచ్చాక మాత్రమే జరుగుతాయి. వివిధ అధ్యయనాల ప్రకారం భారతదేశంలో సుమారు 35 సంవత్సరాలు పైబడినవారు సహజ మరణానికి గురవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా 40 సంవత్సరాలకు పైబడిన వారు సహజ మరణాలు కారణంగా చనిపోతున్నట్లు అనేక అధ్యయనాల్లో తేలింది.

గణాంకాల ప్రకారం 40 ఏళ్ళ వయస్సులో ఉన్నవారు సహజ మరణం కారణంగా చనిపోవడం అనేది ఒక శాతం కంటే తక్కువ అని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే అదే వ్యక్తికి 75 నుంచి 80 సంవత్సరాల వయసు వచ్చేసరికి సహజ మరణం కారణంగా చనిపోయేవారు 40 శాతానికి పైగా ఉందని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే మరణానికి కచ్చితంగా వృద్ధాప్యం కారణమవుతుందని తెలుస్తోంది.

అంతకంతకూ పెరిగిపోతున్న మన వయస్సు అనేది ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుందని స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే కొంతమంది వందకుపైగా సంవత్సరాలు ఈజీగా గడిపేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం వారి శరీర నిర్మాణం ఒకటైతే మరొకటి తీసుకునే ఆహారం. అంతేకాకుండా వారి శరీరంలో జరిగే జీవక్రియలు కూడా దీనిని నిర్దేశిస్తాయి అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

మానవుని శరీరంలో జీవక్రియలు సరైన రీతిలో పని చేసినంత వరకూ ఆరోగ్యానికి ఎలాంటి హానీ అనేది ఉండదు అంతేకాకుండా మీరు ఎంత వయసు వచ్చినా చలాకీగా ఉంటారు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. వైద్య శాస్త్రాన్ని సంబంధించి పొట్టి స్థాయి కారణాలు ఇంకా వెల్లడి కాలేదు అయితే ఎందుకు ప్రభావితం చేసే అంశాలను మాత్రం పరిశోధకులు గుర్తించారు. వీటిలో ప్రధానంగా వయసు పైబడినప్పుడు వచ్చే డయాబెటిస్ కిడ్నీ సమస్యలు షుగర్ బీపీ లాంటివి మానవుని శరీరాన్ని ప్రభావితం చేస్తున్నాయని పరిశోధనలో తేలింది.

వీటిని అధిగమించి గలిగితే చాలా మంది వరకు బతికే అవకాశాలు ఉన్నాయని స్పష్టమవుతోంది. వంద సంవత్సరాలు బతికిన మహిళలు పురుషులు ఎవరైనా కానీ 70 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కనీసం డాక్టర్ దగ్గర కూడా వారు వెళ్లి ఉండదు. ఎందుకంటే వారి ఆరోగ్యం ఆ వయసులో అనుకూలించడం ప్రధాన కారణం. ఈ విధంగానే ఆరోగ్యం అనేది బాగుంటే వ్యక్తి ఎక్కువ సంవత్సరాలు బతకడానికి వీలుంటుంది. 70 ఏళ్ళలో ఒక వ్యక్తి శరీరానికి ఖర్చుపెట్టే మొత్తం కంటే వందేళ్లు బతికిన వ్యక్తి తన చివరి రోజుల్లో ఖర్చుపెట్టి మొత్తం చాలా అంటే చాలా తక్కువ.

వందేళ్లకు పైబడిన బతికిన వారి ఆహారపు అలవాట్లు జీవన విధానాన్ని ఒకసారి గమనిస్తే వారు తీసుకునే ఆహారం చాలా తక్కువ అని తెలుస్తోంది. వీరు శారీరకంగా కూడా తక్కువ బరువుతో ఉంటారు. వీరి జీవన విధానంలో ధూమపానం మద్యపానం లాంటివి తక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయి.

వీరిలో చాలామంది సరైన సమయానికి ఆహారం తీసుకోవడం ఒక అలవాటుగా చేసుకొని ఉంటారు. అంతేకాకుండా ఒక రోజులో వారు కనీస పక్షం మూడు నుంచి ఐదు రకాల పండ్లను తీసుకోవడం కూడా గమనార్హం. వారి ఆహారపు అలవాట్లకు తగినట్టుగా వ్యాయామం చేయడం కూడా చేస్తుంటారని వివిధ అధ్యయనాలు తెలిపాయి.

వందేళ్లకు పైగా బతకడానికి మరో కారణం ఏమిటంటే వారి తాత తండ్రి నుంచి వచ్చినటువంటి జీన్స్. జన్యుపరంగా కూడా ఎక్కువమంది సెంచరీ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. వారి ఆహార శైలి ఎలా ఉన్నా కూడా ఆరోగ్యంగా ఉండడం గమనార్హం.