Begin typing your search above and press return to search.

ఐపీఎల్ : సెకండాఫ్ కి ఈ స్టార్ ప్లేయర్స్ దూరం..ఆ జట్లకి కష్టమే !

By:  Tupaki Desk   |   24 Aug 2021 12:30 AM GMT
ఐపీఎల్ : సెకండాఫ్ కి ఈ స్టార్ ప్లేయర్స్ దూరం..ఆ జట్లకి కష్టమే !
X
ఓ వైపు విరాట్‌‌‌‌ కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా ఇంగ్లండ్‌‌ టూర్‌‌ లో ఉండగానే , మరోవైపు యూఏఈ గడ్డపై ఇండియన్‌‌ ప్రీమియర్‌‌ లీగ్‌‌ సందడి మొదలైంది. కోహ్లీ, రోహిత్‌‌, బుమ్రా వంటి స్టార్లు ఇంగ్లిష్‌‌ టీమ్‌‌ తో టెస్టు సిరీస్‌‌ ఆడుతుండగా, ధోనీ, రైనా వంటి వెటరన్స్‌‌ , యంగ్‌‌ స్టర్స్‌‌ వచ్చే నెల 19 నుంచి అరబ్‌‌ గడ్డపై జరిగే ఐపీఎల్‌‌ 14వ సీజన్‌‌ ఫేజ్‌‌2 కోసం రెడీ అవుతున్నారు. చెన్నై సూపర్‌‌ కింగ్స్‌‌, ముంబై ఇండియన్స్‌‌ ఇప్పటికే యూఈఏ చేరుకొని ప్రాక్టీస్‌‌ షురూ చేశాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌‌ కూడా అరబ్‌‌ గడ్డపై అడుగు పెట్టింది. మిగతా ఫ్రాంచైజీలు కూడా ఈ నెలాఖర్లోగా యూఏఈ చేరుకొని ప్రాక్టీస్ ప్రారంభించే ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటున్నాయి.

దే టైమ్‌‌లో కొత్త సీజన్‌‌ కాకపోయినప్పటికీ.. సెకండ్‌‌ ఫేజ్‌‌ కోసం పలు టీమ్స్‌‌లో మార్పులు జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్‌‌ షెడ్యూల్‌‌, ఫారిన్‌‌ ప్లేయర్ల అందుబాటును దృష్టిలో ఉంచుకొని టీమ్‌‌లో మార్పులు చేసుకుంటున్నాయి. కొన్ని దేశాల స్టార్ ఆటగాళ్లు ఈ ఐపీఎల్ సెకండ్ పేజ్ కి దూరంగా ఉండబోతున్నారు.

ఈ ఐపీఎల్ 2021 సెకండ్ పేజ్ కి అందుబాటులో లేని స్టార్ ఆటగాళ్ల జాభితా చూస్తే ..

ఆడమ్‌‌ జంపా, డానియల్‌‌ సామ్స్‌‌, ఫిన్‌‌ అలెన్‌‌ .. రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు.

పాట్ కమిన్స్ .. కేకేఆర్ ,

రిలే మెరెడిత్ , జై రిచర్డ్సన్ -- పంజాబ్ ,

జొస్ బట్లర్ , బెన్ స్టోక్స్ -- రాజస్థాన్ ,

ఈ ఆటగాళ్లు ఐపీఎల్ సెకండ్ పేజ్ కి అందుబాటులో ఉండటం తో లేదు. దీనితో ఇప్పటికే ఈ ఆటగాళ్ల స్థానంలో వేవ్ వారిని తీసుకోని ఐపీఎల్ కప్ కొట్టాలనే లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. లంక టాప్‌‌ స్పిన్నర్‌‌ వానిందు హసరంగ, పేసర్‌‌ దుష్మంత చమీరాతో పాటు బిగ్‌‌బాష్లో దుమ్మురేపిన సింగపూర్ ప్లేయర్ టిమ్‌‌ డేవిడ్‌‌ ను కొత్తగా టీమ్‌‌ లోకి తీసుకుంది రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు. ఐపీఎల్‌‌14 రీస్టార్ట్‌‌కు టైమ్‌‌ దగ్గరపడుతున్న వేళ చెన్నై సూపర్‌‌ కింగ్స్‌‌ కు ఓ గుడ్‌‌ న్యూస్‌‌. ఆస్ట్రేలియా పేసర్‌‌ జోష్‌‌ హేజిల్‌‌వుడ్‌‌.. సెకండ్‌‌ ఫేజ్‌‌ మ్యాచ్‌‌లకు చెన్నైకు అందుబాటులో ఉండనున్నాడు. ఈ విషయాన్ని సీఎస్‌‌కే సీఈవో కాశీ విశ్వనాథన్‌‌ వెల్లడించారు. బట్లర్‌‌‌‌కు రీప్లేస్‌‌‌‌మెంట్‌‌‌‌గా న్యూజిలాండ్‌‌‌‌ టాపార్డర్‌‌‌‌, వికెట్‌‌‌‌ కీపర్‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌ గ్లెన్‌‌‌‌ ఫిలిప్స్‌‌‌‌ను రాయల్స్‌‌‌‌ జట్టులోకి తీసుకుంది. భుజం గాయం నుంచి కోలుకున్న శ్రేయస్‌‌ అయ్యర్‌‌.. కొద్దిరోజుల క్రితమే దుబాయ్‌‌ చేరుకున్నాడు. అంతేకాకుండా ప్రాక్టీస్‌‌ కూడా మొదలుపెట్టేశాడు. కాగా, ఢిల్లీ తమ కెప్టెన్‌‌గా రిషబ్‌‌ పంత్‌‌ను కొనసాగిస్తుందా లేదంటే అయ్యర్‌‌కు తిరిగి బాధ్యతలు అప్పగిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.