Begin typing your search above and press return to search.

బ్యాలెట్ తోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు: ఈసీ నిర్ణయం

By:  Tupaki Desk   |   5 Oct 2020 5:31 PM GMT
బ్యాలెట్ తోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు: ఈసీ నిర్ణయం
X
తెలంగాణలో ఇప్పుడు రెండు ఎన్నికలు రాజకీయ పార్టీల్లో కాక పుట్టిస్తున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నాయి. ఒకటి దుబ్బాక ఎన్నిక కాగా.. రెండోది జీహెచ్ఎంసీ ఎన్నికలు..

ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం జీహెచ్ఎంసీ ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది.

కరోనా వైరస్ నేపథ్యంలో ఇప్పుడు ఈవీఎంలతో నిర్వహిస్తే ఒక్క ఓటరుకు కరోనా ఉంటే అందరూ ఈవీఎంలు నొక్కితే అందరికీ వ్యాపిస్తుంది. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం బ్యాలెట్ ఓటింగ్ కే నిర్ణయం తీసుకుంది.

ఎన్నికల నిర్వహణపై పార్టీల అభిప్రాయం తీసుకున్నాకే ఈ నిర్ణయాన్ని ఎస్ఈసీ తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది.

రాష్ట్రంలో మొత్తం 11 గుర్తింపు పొందిన రాజకీయాల పార్టీలు ఉన్నాయని.. అందులో 8 పార్టీలు తమ అభిప్రాయం తెలిపాయని ఈసీ ప్రకటించింది. బీజేపీ మాత్రమే ఈవీఎం ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు వెల్లడించింది. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం బ్యాలెట్ పేపర్ ఎన్నికకే అనుకూలంగా ఉంది.

నవంబర్ మొదటి లేదా.. రెండో వారంలో జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి అవకాశం ఉన్నట్లు తెలిసింది.