Begin typing your search above and press return to search.

'సత్యం' పై 14ఏళ్ల పాటు సెబీ నిషేధం

By:  Tupaki Desk   |   3 Nov 2018 9:30 AM GMT
సత్యం పై 14ఏళ్ల పాటు సెబీ నిషేధం
X
మైక్రోసాఫ్ట్ ను తలదన్నేలా ఎదుగుదామని.. ఆర్థిక అవకతవకలతో కుదేలైన ఐటీ సంస్థ ‘సత్యం కంప్యూటర్స్’. సత్యం కుంభకోణం బయటపడ్డటప్పుడు అది ఒక సంచలనం. ఎన్నో వాయిదాల అనంతరం సత్యం వ్యవస్థాపకుడు రామలింగరాజు - అతని సోదరులు రామరాజు - సూర్య నారాయణ రాజు తదితరులకు కోర్టు జైలు శిక్ష విధించింది. సెబీ ఆయన కంపెనీలపై నిషేధం విధించింది. వేలాది మంది ఉద్యోగులు జీతాల కోసం ఆందోళన బాట పట్టారు. ఇదంతా జరిగి 10 ఏళ్లు కావస్తుంది.

తాజా సత్యం రామలింగరాజుకు సెబీ షాక్ ఇచ్చింది. కోర్టులో ఉన్న వారి వివాదంలో తాజాగా తీర్పు వెలువరించింది. 14 ఏళ్ల పాటు సెక్యూరిటీస్ కార్యకలాపాల్లో పాల్గొనరాదని రామలింగరాజు, అతని సోదరులపై కోర్టు నిషేధం విధించింది. రూ.813 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.

హైదరాబాద్ నగరంలో 1987లో కేవలం 20 మంది ఉద్యోగులతో ప్రారంభించిన సత్యం కంప్యూటర్స్ అనతి కాలంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. బిల్ గేట్స్ తరువాత అంతటి పేరు ప్రఖ్యాతలు ఆర్జించిన రామలింగరాజు.. ఆర్థిక అవకతవకలతో అంతే స్థాయిలో పడిపోయారు. చంద్రబాబు హయాంలో ఆయనను ఎంతో ఆకాశానికి ఎత్తారు.. అంతే స్థాయిలో ఆయన పతనం కొనసాగింది.

తాజాగా సెక్యూరిటీ అప్పిలేట్ ట్రిబ్యూనల్ సూచనల మేరకు సెబీ రామలింగరాజు, ప్రభృతులపై 14 ఏళ్ల పాటు నిషేధం విధించింది. మార్కెటింగ్ కార్యకలాపాల్లో పాల్గొనరాదని పేర్కొంది. ఆర్థిక అవకతవకలకు పాల్పడిన మొత్తం 1258.88 కోట్ల మొత్తాన్ని ఇప్పుడు రూ.813.40 కోట్లకు తగ్గిస్తూ చెల్లించాలని తీర్పు చెప్పింది. సత్యం కుంభకోణం వెలుగులోకి వచ్చిన 2009 జనవరి నుంచి 12 శాతం వార్షిక వడ్డీ రేటుతో 45 రోజుల్లో ఈ మొత్తాన్ని చెల్లించాలి.