Begin typing your search above and press return to search.

దక్కన్ క్రానికల్ ఛైర్మన్ మీద నిషేధం?

By:  Tupaki Desk   |   1 Jan 2020 6:22 AM GMT
దక్కన్ క్రానికల్ ఛైర్మన్ మీద నిషేధం?
X
ప్రముఖ మీడియా సంస్థ దక్కన్ క్రానికల్ సంస్థ ఛైర్మన్ కు సంబంధించిన వ్యవహారాలు తరచూ వివాదాస్పదం కావటంతో పాటు.. వార్తల్లోకి వస్తుంటారు. తప్పుడు పత్రాలతో బ్యాంకకు వందల కోట్లు కుచ్చు టోపీ పెట్టినట్లుగా ఆరోపణలు ఉన్న విసయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఉదంతానికి సంబంధించిన కేసులు నమోదు కావటమే కాదు.. విచారణ సాగుతోంది.

ఇలాంటివేళ.. తాజాగా మార్కెట్ రెగ్యులేటర్ సెబీ సాకిచ్చింది.దక్కన్ క్రానికల్ ఛైర్మన్ టి. వెంకట్రామ రెడ్డి.. వైస్ ఛైర్మన్ టి. వినాయక్ రవిరెడ్డి.. పరుశురామన్ కార్తీక్ అయ్యర్.. ఎండీ ఎన్‌. కృష్ణన్‌లపై రెండేళ్ల పాటు నిషేధం విధిస్తూ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నారు. అదే సమయంలో సీబీ మౌలీ అండ్ అసోసియేట్స్ భాగస్వామి మణి ఊమెన్ పైనా ఏడాది పాటు బ్యాన్ విధించారు.

అంతేకాదు.. సదరు కంపెనీకి సీఎస్ (కంపెనీ సెక్రటరీ) శంకర్ ను ఏడాది పాటు సేవలు అందించకూడని పేర్కొంది. సంస్థ వద్ద తగినన్ని నిల్వలు లేకున్నా షేర్లు బై బ్యాక్ ఆఫర్ ను ప్రకటించటం వివాదంగా మారింది. గత ఏడాది ఆగస్టులో బ్యాంకు మోసానికి సంబంధించి డీసీ ఆపీసుపై ఈడీ దాడులు చేపట్టింది. అంతేకాదు.. 2017లో రూ.217 కోట్లు విలువైన ఆస్తుల్ని అటాచ్ చేయటాన్ని మర్చిపోలేం. బెంగళూరు.. కేరళకు చెందిన డీసీ ఎడిషన్లను ఇటీవల నిలిపివేశారు. తాజాగా ఆ సంస్థ ఛైర్మన్ మీద రెండేళ్ల పాటు సెబీ బ్యాన్ చేయటం సంచలనంగా మారిందని చెప్పక తప్పదు.