Begin typing your search above and press return to search.

భవిష్యత్ ఇదేనా?; బ్రిటన్ ముక్కలు అవుతుందా?

By:  Tupaki Desk   |   24 Jun 2016 12:32 PM GMT
భవిష్యత్ ఇదేనా?; బ్రిటన్ ముక్కలు అవుతుందా?
X
గ్రేట్ బ్రిటన్ భవిష్యత్ ఏమిటి? ఇప్పుడు పలువురి మనసుల్లో మెదులుతున్న ప్రశ్న. బ్రెగ్జిట్ ఫలితం వెలువడి.. యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలన్న నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నాలుగు దేశాల సమాహారమైన గ్రేట్ బ్రిటన్ భవిష్యత్ ఏమిటన్నది ఇప్పుడు అసలుసిసలు ప్రశ్న. దీనికి కారణం లేకపోలేదు. బ్రిగ్జిట్ ఫలితాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు బయటకు వస్తాయి. నాలుగు దేశాల సమాహారమైన గ్రేట్ బ్రిటన్ లో ఇంగ్లండ్.. వేల్స్ లోని ఎక్కువ మంది యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు రావాలని ఓటు వేస్తే.. ఉత్తర ఐర్లాండ్.. స్కాట్లాండ్ కు చెందిన అత్యధికులు యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు రాకూడదని భావించారు. ఇందుకు తగ్గట్లే ఓట్లేశారు.

అయితే.. వీరి ఓట్లను.. ఇంగ్లండ్ ప్రజలేసి ఓట్లు డామినేట్ చేయటంతో.. ఈ రెండు ప్రాంతాల ప్రజల మనోభావాలకు విరుద్ధ ఫలితం వచ్చిన పరిస్థితి. దీంతో.. యూరోపియన్ యూనియన్ దేశాల సమాఖ్య నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి. అభిప్రాయ సేకరణ ఫలితం వచ్చిన వెంటనే సమాఖ్య నుంచి బయటకు రావటం సాధ్యం కానప్పటికీ.. సమాఖ్యతో పూర్తి స్థాయి తెగతెంపులు చేసుకోవటానికి రెండేళ్ల సమయం పట్టే వీలుంది.

ఈ ఫలితానికి బ్రిటన్ ముక్కలు కావటానికి లింకేమిటన్న ప్రశ్నకు పలువురు చెబుతున్న వాదన ఏమిటంటే.. ఇప్పటికే గ్రేటర్ బ్రిటన్ లోని పలు దేశాల మధ్య పొరపొచ్చాలు ఎక్కువే. ఆ మధ్యన ఐర్లాండ్ గ్రేట్ బ్రిటన్ నుంచి బయటకు రావాలని అనుకోవటం.. ఆ సమయంలో ఇంగ్లండ్ తో సహా పలు దేశాల వారు అలా వద్దంటే వద్దంటూ కోరుకోవటం.. చివరకు జరిగిన ప్రజాభిప్రాయంలో కలిసి ఉండాలన్న నిర్ణయం తీసుకోవటంతో కలిసి ఉంది.

లేదంటే.. అప్పుడే ఐర్లాండ్ తన దారిన తాను బయటకు వచ్చేసే పరిస్థితి. తాజాగా తమ అభిప్రాయానికి భిన్నంగా చోటు చేసుకున్న పరిణామాల పట్ల ఐర్లాండ్.. స్కాట్లాండ్ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికిప్పుడు కాకున్నా.. తాజా ఫలితాల కారణంగా రేపొద్దున్న గ్రేట్ బ్రిటన్ కానీ ప్రతికూల పరిణామాలు ఎదురైతే.. ఈ రోజు సమాఖ్య నుంచి బయటకు రావాటానికి ఓటేసిన ఇంగ్లండ్.. వేల్స్ ప్రజల్ని తప్పు పట్టటం ఖాయం. తమ అభిప్రాయానికి విలువ లేని చోట కలిసి ఉండటాన్ని వ్యతిరేకించొచ్చు.

అయితే.. ఇవన్ని ఇప్పటికిప్పుడు జరగకున్నా.. భవిష్యత్ లో జరిగేది ఇదేనన్న అభిప్రాయాన్ని పలువురు అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఇదంతా జరగటానికి కొంత సమయం పడుతుందన్న మాట వినిపిస్తోంది. తాజా బ్రెగ్జిట్ ఫలితం వ్యక్తిగత స్వార్థానికి నిదర్శనంగా చెప్పొచ్చని.. అలాంటి భావనలు ఉన్న ప్రజలు కలిసి ఉండే అవకాశం తక్కువగా చెప్పొచ్చు. మరి.. ఈ వాదనను గ్రేట్ బ్రిటన్ వాసులు తప్పని తేలిస్తే.. సంతోషమే. కానీ.. అంతటి విశాల హృదయమే వారికి ఉండి ఉంటే.. ఈ రోజు ఇలాంటి ఫలితం వచ్చేది కాదు.