Begin typing your search above and press return to search.

జ్యోతిరాదిత్య సింధియాకి వైరస్ పాజిటివ్ ...!

By:  Tupaki Desk   |   9 Jun 2020 4:38 PM IST
జ్యోతిరాదిత్య సింధియాకి వైరస్ పాజిటివ్  ...!
X
దేశ రాజధాని ఢిల్లీలో వైరస్ రోజురోజుకి మరింత వేగంగా విజృంభిస్తోంది. కొత్త కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు డాక్టర్లు, పోలీసులు, రాజకీయ నేతలు కూడా కరోనా బారినపడుతున్నారు. తాజాగా బీజేపీ ముఖ్యనేత , యువ నేత జ్యోతిరాదిత్య సింధియాకు వైరస్ సోకింది. అతనితోపాటు తల్లి మాధవి రాజే సింధియాకు కూడా పాజిటవ్ వచ్చింది. వీరిద్దరినీ దక్షిణ ఢిల్లీ సాకెట్ వద్ద గల మ్యాక్స్ ఆస్పత్రిలో చేర్చించారు. వైరస్ లక్షణాలు కనిపించడంతో నాలుగురోజుల క్రితం సింధియా ఆస్పత్రిలో చేరాడు. సింధియాకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని బీజేపీ నేతలు ధృవీకరించారు

ఇటీవల బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రాలో కూడా కరోనా లక్షణాలు కనిపించాయి. గుర్‌గావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో ఆయన ట్రీట్ మెంట్ తీసుకున్నారు. చికిత్స అనంతరం సోమవారం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. కరోనా లక్షణాలు ఉండడంతో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇవాళ ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులు రావాల్సి ఉంది.