Begin typing your search above and press return to search.

యుగాంతంపై సైంటిస్టుల హెచ్చరిక..!

By:  Tupaki Desk   |   3 Jan 2023 12:30 PM GMT
యుగాంతంపై సైంటిస్టుల హెచ్చరిక..!
X
కంటికి కనిపించని సూక్ష్మజీవి(వైరస్) మనిషి మనుగడను శాసిస్తోంది. చైనాలోని వ్యూహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని రెండేళ్లపాటు గడగడలాడించింది. అయితే గతంలోనూ కొన్ని రకాల సూక్ష్మజీవులు పెద్ద సంఖ్యలో జీవరాశులను కబళించిన ఘటనలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే అనేక పుకార్లు షికార్లు చేస్తున్నారు.

చైనాలో మళ్లీ వెలుగు చూస్తున్న కరోనా కేసులు ప్రపంచాన్ని మరోసారి భయాందోళనకు గురిచేస్తోంది. జీరో కోవిడ్ విధానానికి చైనా స్వస్తి పలకడంతో ఆ దేశంలో రోజుకు కోట్లల్లో పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా రోగులకు కనీసం బెడ్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఈ భయాందోళన మధ్యే సైంటిస్టులు సైతం యుగాంతంపై హెచ్చరికలు జారీ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

భూమిపై ఉన్న జీవరాశి ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి దాదాపు 90 శాతం అంతరించిపోతుంది. తిరిగి మళ్లీ కొత్తగా జీవరాశి పుట్టుకొట్టుంది. దీనినే సామూహిక నాశనమంటారని సైంటిస్టులు పేర్కొంటున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే ఐదు సార్లు జరిగిందని ఇప్పుడు మనం ఇప్పుడు జరగబోయేది ఆరోదని చెబుతున్నారు.

ప్రస్తుతం మనం ఆరో యుగాంతం మధ్యలో ఉన్నామని సైంటిస్టులు చెబుతుండటం గమనార్హం. ఈసారి రాబోతున్న యుగాంతానికి మనిషి స్వయంకృతాపరధమే కారణమని చెబుతున్నారు. భూమిపై మనుషుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి ఇతర జీవులకు నీడ కూడా లేకుండా పోతుందని వివరించారు.

ఆరున్నర కోట్ల ఏళ్ళ కిందట నాడు బత్రికి ఉన్న రాక్షస బల్లులు.. డైనోసార్లు సహా పలు జీవులన్నీ పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయాయి. కొన్ని జంతు జాతులు పూర్తిగా అంతరించిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా మళ్లీ ఆ స్థాయి ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు.

గత 50 ఏళ్లలో భూమిపై ఉన్న జీవుల్లో 69 శాతం కనుమరుగయ్యాయని వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ పేర్కొంది. జనాభా పెరుగుతున్న కొద్దీ అడవులు.. చెరువులు.. గుట్టలు.. నదులు అన్నీ మాయమవుతున్నాయి. జీవులకు నిలువ నీడ లేకుండా పోతుందని అందుకే తరచూ వన్యమృగాలు ఇళ్లల్లోకి వస్తున్నాయి. ఈ ప్రాణులన్నీ బతుకాలంటే ఈ భూమి సరిపోదు.

20 ఏళ్ల కిందట వరకు కూడా ఇంటి చుట్టూరా పక్షుల కిలకిలలు.. కోయిల కుహు.. కుహులు వినిపించేవి. ఇప్పుడు మచ్చుకు కూడా అలాంటి ఘటనలు కన్పించడం లేదు. అడవులు.. పక్షులు.. జంతువులన్నీ కనుమరుగు అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలనూ ఇదే పరిస్థితి నెలకొంది.

అమెజాన్ నది లోయలోని దక్షిణ అమెరికాలోనూ ఇదే పరిస్థితి. 1970 నుంచి ఇప్పటి వరకు అక్కడ 94 శాతం జీవులు మాయమయ్యాయని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామూహిక ప్రాణి హననం జరగడమే యుగాంతమని.. ప్రస్తుతం జరుగుతుంది కూడా ఇదేనంటూ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.