Begin typing your search above and press return to search.

బ్రిటన్​, రష్యా వ్యాక్సిన్లు కలిపి ఒక్కటిగా! ఇది చాలా పవర్​ఫుల్​ అంట..!

By:  Tupaki Desk   |   12 Dec 2020 5:33 AM GMT
బ్రిటన్​, రష్యా వ్యాక్సిన్లు కలిపి ఒక్కటిగా!  ఇది చాలా పవర్​ఫుల్​ అంట..!
X
రష్యా తయారు చేసిన స్పుత్నిక్​​ వీ, బ్రిటన్​లోని ఆక్స్​ఫర్డ్​ తయారుచేసిన ఆస్ట్రాజెనికా సత్ఫలితాలు ఇస్తున్న విషయం తెలిసిందే. రష్యా వ్యాక్సిన్​ను మనదేశంలో రెడ్డి ల్యాబ్స్​ తీసుకున్నది. అయితే ఈ రెండు వ్యాక్సిన్లను కలిపి ఇప్పుడు మరో వ్యాక్సిన్​నుతయారుచేయబోతున్నారట. ఈ వ్యాక్సిన్​ చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కొత్త వ్యాక్సిన్​ తయారీ కోసం బ్రిటన్, రష్యా శాస్త్రవేత్తలు చర్చలు జరుపుతున్నారు. ఒక వేళ ఈ రెండు వ్యాక్సిన్లు కలిపితే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయా లేదా అన్న విషయంపై వాళ్లు చర్చలు జరుపుతున్నారు.

రెండు వ్యాక్సిన్లను కలిపి తయారుచేసే కొత్త వ్యాక్సిన్​ ద్వారా శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ మేరకు రష్యాలో క్లినికల్​ ట్రయల్స్​ జరగనున్నాయి. మొదట 18 ఏళ్లు పైబడిన వాళ్లకు ఈ వ్యాక్సిన్​ ఇవ్వనున్నారు. ఈ ప్రయోగాలు ఎంతకాలం నిర్వహిస్తారు. ట్రయల్స్​ ఎప్పటివరకు ముగుస్తాయి అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఆక్స్​ఫర్డ్​ తయారు చేసిన ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్​ మెరుగైన ఫలితాలనే ఇచ్చింది.

కానీ ఈ వ్యాక్సిన్​ ఇంకా వృద్ధులపై ప్రయోగించలేదు. దీంతో బ్రిటన్​ ప్రభుత్వం దీనికి అనుమతి ఇవ్వలేదు. మరోవైపు స్పుత్నిక్​ కూడా మెరుగైన ఫలితాలనే ఇచ్చింది. కొద్దిమందిలో దుష్ఫ్రభావాలు కనిపించినప్పటికీ అవి ఏమంతా సీరియస్​గా తీసుకోవాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. మొత్తానికి ఈ రెండు వ్యాక్సిన్లను కలిపి తీసుకొచ్చే కొత్త వ్యాక్సిన్​ ఎటువంటి ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి.