Begin typing your search above and press return to search.

సహారా ఏడారిలో 180 కోట్ల వృక్షాలు.. ఆశ్యర్చంగా ఉన్నా ఇదే నిజం..!

By:  Tupaki Desk   |   17 Oct 2020 1:30 AM GMT
సహారా ఏడారిలో 180 కోట్ల వృక్షాలు.. ఆశ్యర్చంగా ఉన్నా ఇదే నిజం..!
X
సహారా ప్రపంచములోనే రెండవ అతి పెద్ద ఎడారి. ఈ ఎడారి వైశాల్యం 9,000,000 చదరపు కి.మీ (3,500,000 చదరపు మైళ్ళు). అయితే ఈ ఎడారి ప్రాంతం గురించి ఇప్పుడు ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ ఎడారి ప్రాంతంలో 180 కోట్ల వృక్షాలున్నట్టు శాటిలైట్, ఇమేజరీ టెక్నిక్, కొత్త ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అల్గారిథమ్ తో సైంటిస్టులు కనుక్కొన్నారు. ఎడారి ప్రాంతంలో చెట్లను వెదకడం అనేది ఓ సాహసక్రీడగానే చెప్పవచ్చు. ఇంత విస్తారమైన ప్రాంతంలో చెట్ల సంఖ్య కనుక్కోవడం మామూలు విషయం కాదు. ఈ పద్ధతితో ఆ ప్రాంతంలోని చెట్ల సంఖ్యను కనుగొని వెస్టరన్ సహారా 1.8 బిలియన్ (180కోట్లు)కు పైగా ఉన్నాయని విశ్లేషణలో తేలింది. చెట్లు, పొదల్లాంటి మొక్కలు ఆ ప్రాంతాలని పచ్చగా మారుస్తున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు.

అవి కొన్ని జంతువులకు నివాసాలు, ఆహార వనరులుగానూ ఉంటున్నాయట. నేల కొట్టుకుపోవడం వంటి వాటి నుంచి పరిసరాలను కాపాడుతున్నాయి. మార్టిన్ బ్రాండ్, అతని కొలీగ్స్ కలిసి హై రిసొల్యూషన్ సెన్సింగ్ డేటాతో శాటిలైట్ ఇమేజెస్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెనస్ పాటరన్ రికగ్నిషన్ అల్గారిథమ్ ఉపయోగించి సంఖ్యను లెక్కపెట్టారు. మొట్టమొదటి సారి ఈ టెక్నిక్​తో చెట్లను లెక్కించారట. వెస్టరన్ సహారా, సాహెల్, సుదానియన్ జోన్ లలో చాలావరకూ చెట్లు ఉన్నట్టు తెలింది. దాదాపు 1.3మిలియన్ చదరపు కిలోమీటర్ల వరకూ విస్తరించి ఉన్నాయి. వెనువెంటనే కన్‌క్లూజన్ కు రావడం అనేది చాలా కష్టం. పైగా అది వెస్టరన్ ఆఫ్రికాలో.. ఈ మెథడ్ వాడి మాత్రం కరెక్ట్ నెంబర్ కనుక్కోగలిగాం. ఆ ప్రాంతంలో ఉన్న మొక్కలను హైలెట్స్ చేయడంతో అవి ఉన్న సంఖ్యను తెలుసుకోగలిగాం. అని మార్టిన్ బ్రాండ్ వివరించారు.

ఈ టెక్నిక్ ఎక్కడైనా వాడొచ్చని శాటిలైట్ డేటా 0.5మీటర్ల రిసొల్యూషన్ తో కనిపిస్తుంది. ప్రతి అబ్జెక్టివ్ డేటాను స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తుంది. డీప్ లెర్నింగ్ లో భాగంగా మేం చెట్లు ఎలా కనిపిస్తాయనేది అల్గారిథంలో ముందుగానే సేవ్ చేసి ఉంచాం. ఇలా ట్రైనింగ్ లో చేయడంతో శాటిలైట్ చెట్లు కనిపించినప్పుడు క్రౌన్స్(కిరీటాలు)కనిపించేవి. అప్పుడు మేం కచ్చితంగా చెట్లు, ఇళ్లు, కార్లు, ఆవులు ఏమున్నా సరే తెలుసుకోగలం. ఇదంతా చాలా ఖరీదైన శాటిలైట్ ఇమేజింగ్ టెక్నిక్ తోనే సాధ్యపడింది’ అని మార్టిన్ బ్రాండ్ట్ అన్నారు. ఇతర ప్రదేశాల్లో ఇదే ప్రయోగం చేయాలంటే ముందుగా చేయాల్సింది శాటిలైట్ డైటా చీప్ గా దొరికేలా చేసుకోవాలి. సరిపడ అల్గారిథమ్స్ రాసుకుని.. గ్రౌండ్ వర్క్ పై మరికొంచెం ఫోకస్ పెట్టాలి’ అని ఎకో సిస్టమ్ ఎకాలజిస్ట్ నియాల్ హనన్ అన్నారు. ఏది ఏమైనా ఇటువంటి ఎడారి ప్రాంతంలో చెట్లను లెక్కపెట్టడం అనేది నిజంగా సాహసమే.