Begin typing your search above and press return to search.

తీయని మాటలతో .. లక్షలు లాగేసుకుంది..:కరీంనగర్ ‘కిలేడీ’ అరెస్టు

By:  Tupaki Desk   |   11 Dec 2021 6:00 AM IST
తీయని మాటలతో .. లక్షలు లాగేసుకుంది..:కరీంనగర్ ‘కిలేడీ’ అరెస్టు
X
ఆమె.. అందమైన యువతీ యువకుల ఫొటోలు సేకరిస్తుంది.. ఆ తరువాత తాను అమ్మాయి.. లేదా.. అబ్బాయి అన్నట్లు ఇతరులతో చాట్ చేస్తుంది. అటువైపు వారు కాస్త లోబడి తమ పర్సనల్ విషయాలు బయటపెట్టేలా తీయగా మాట్లాడుతుంది.

ఇలా బుట్టలో పడ్డవారిని చాటింగ్ ను స్క్రీన్ షాట్ చేస్తుంది.. ఆ తరువాత అసలు విషయాన్ని చెప్పిన డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది.. లేకపోతే తమ పర్సనల్ విషయాలను బయటపెడుతానంటూ బెదిరిస్తుంది.. ఇలా కొందరు బాధితులు ఇప్పటికే లక్షలు ముట్టజెప్పారు. కానీ కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ మహిళ చేస్తున్న మోసాలు బయటపడ్డాయి.

తెలంగాణలోని కరీంనగర్ టౌన్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటి వరకు మొత్తం 34 సోషల్ మీడియా అకౌంట్లను క్రియేట్ చేసింది. టార్గెట్ చేసిన వ్యక్తులను తన ఫేక్ అకౌంట్ల ద్వారా తాను మ్యూచువల్ ఫ్రెండ్ గా చాట్ చసింది.

ఒక్కరే చలా మందిగా నమ్మించింది. తన ఫ్రెండ్ కు ఆరోగ్య సమస్యలకు వచ్చాయని, అందుకు రూ.2 లక్షల రూపాయలు సాయం చేశారని బ్యాంకు స్లిప్పును సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలా ఇతరుల వద్ద నుంచి సాయం పేరిట లక్షల రూపాయలు దోచుకుంది. అని ఏసీపీ తెలిపారు.

జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఈమె ప్రస్తుతం కరీంనగర్లో ఉంటున్నారు. ‘మిషన్ భగీరథ’లో కాంట్రాక్టు ఉద్యోగి అయిన ఈమె కరీంనగర్లో నివాసం ఉంటున్నారు. ఇన్ స్ట్రాగ్రాం లాంటి సోషల్ మీడియా అకౌంట్ల నుంచి అందమైన యువతీ, యువకుల ఫొటోలు సేకరించి వారి ఫొటోలతో అకౌంట్లను క్రియేట్ చేసేంది.

అలా అటు అమ్మాయిలు.. ఇటు అబ్బాయిలతో చాట్ చేసి వారి వద్ద నుంచి డబ్బులు లాగేసుకుంది. ఆ తరువాత వ్యక్తిగత వివరాలు షేర్ చేసుకున్న కొందరి చాట్ లు బయటపెడుతానని, అందుకు డబ్బులు ఇవ్వాలని బెదిరించేది.

ఈ మహిళకు ఎలాంటి కుటుంబ నేపథ్యం లేకున్నా కుటుంబం ఉన్నట్లు ఫొటోలు క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసేది. సమయానికి అనుగుణంగా ఫొటోలను మారుస్తూ ఎదుటివారిని నమ్మించేది. అంతేకాకుండా తన ఫేస్ బుక్ అకౌంట్లో ఉన్న మ్యూచువల్ ఫ్రెండ్స్ తో గొంతు మార్చి మాట్లాడేది అని పోలీసులు తెలుపుతున్నారు.

ఇదిలా ఉండగా ఈమె తనతో రూంలో ఉన్న యువతిని కూడా మోసం చేసిందని తెలిపారు. అందమైన అబ్బాయి ఫొటో పెట్టి ఓ ఫ్రొఫైల్ క్రియేట్ చేసింది. ఆ తరువాత అకౌంట్ నుంచి ఇంజనీర్ గా పనిచేస్తున్న ఆమెతో పరిచయం చేసుకుంది. ఆ తరువాత తన పర్సనల్ చాట్ బయటపెడుతానని బ్లాక్ మెయిల్ చేసింది.

అంతేకాకుండా పక్కకు వెళ్లి మొగగొంతుతో మాట్లాడుతూ రూమ్మేట్ ను మోసం చేసింది. ఇప్పటికే ఓ వ్యక్తిని పెళ్లి చేసుకొని విడాకులిచ్చిన ఈమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆయనకూ దూరంగా ఉంటోంది. వీరి విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది.

తాను మోసం చేసిన యువతుల్లో ఒకరికి ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. అయితే తనకు కాబోయే భర్త సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా సదరు మహిళను పోలీసులు విచారించారు. దీంతో అసలు విషయం బయపడింది. ఇందులో ఇంజనీర్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. అమె ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నారు.

కానీ ఫేక్ అకౌంట్లతో పెద్ద పెద్ద వాళ్లను బుట్టలో వేసుకుంది అని పోలీసులు తెలిపారు. ఆమె దగ్గరి నుంచి ఓ ల్యాప్ టాప్, 2.5 లక్షల నగదు, 10 సిమ్ కార్టులను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఆమె ఇప్పటి వరకు 20 లక్షలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.