Begin typing your search above and press return to search.

మంత్రి ఈటల పేరు చెప్పి వసూళ్లు

By:  Tupaki Desk   |   28 Oct 2020 11:00 AM IST
మంత్రి ఈటల పేరు చెప్పి వసూళ్లు
X
తనకు ఆ మంత్రి తెలుసు.. సీఎం కేసీఆర్ బంధువుని నేను.. కేటీఆర్ దూరం చుట్టం నేను అంటూ కేటుగాళ్లు ఇటీవల అమాయకులను బురిడీ కొట్టిస్తూ పనుల పేరుతో ‘క్యాష్’ చేసుకుంటున్నారు. తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కూడా వాడుకొని ఓ ప్రబుద్ధుడు వసూళ్లకు దిగాడు.

వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కార్యాలయంలో తాను ఒక అధికారినంటూ పలువురిని బురిడీ కొట్టించి వసూళ్లు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ మండలం శాంపూర్ కు చెందిన కునమల్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి వైద్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఫోన్ చేసి తాను మంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న అధికారిగా పరిచయం చేసుకున్నాడు. మహిళలకు ఫోన్ చేసి వారిలో కొంతమందిని పర్మినెంట్ చేయబోతున్నామని.. ఇందుకు కొంత కొంత ఖర్చు అవుతుందని నమ్మించాడు.

ఈ విషయం మంత్రి దృష్టికి కొంతమంది తీసుకెళ్లడంతో అతడిపై ఫిర్యాదుచేయాలని కార్యాలయ అదికారులను ఆదేశించారు.

ఈటల పీఎస్ చంద్రకాంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇలా మంత్రి పేరు చెప్పి దోచుకుంటున్న వ్యక్తి ఆటకట్టైంది.