Begin typing your search above and press return to search.

డీకే అరుణ కూతురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. కారణమిదే

By:  Tupaki Desk   |   10 Feb 2022 4:52 AM GMT
డీకే అరుణ కూతురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. కారణమిదే
X
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ కూతురు శృతిరెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఎలీషా బాబు అనే కూలీని వ్యక్తిని దూషించారనే అభియోగాలతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.

డీకే అరుణ కూతురు డీకే శృతిరెడ్డి, వినోద కైలాస్ లపై కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

బంజారాహిల్స్ లోని పీవీపీ ఇంటి కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు చేస్తున్న తమను శృతిరెడ్డి దూషించారని ఎలీషాబాబు ఫిర్యాదు చేశారు. ఇంటి స్థలం విషయమై గత కొద్దికాలంగా వైసీపీ నేత, పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్(పీవీపీ).. డీకే అరుణ కూతురు శృతిరెడ్డి మధ్య వివాదం నడుస్తోంది. ఇప్పటికే ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్నారు. తన ఇంటిపై దౌర్జన్యం చేశారని.. గోడ కూలగొట్టేందుకు ప్రయత్నించారంటూ వీపీవీపై శృతిరెడ్డి ఫిర్యాదు చేయడంతో జనవరి 19న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తన ఇంటిపైకి మనుషులను పంపించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

తనపై కేసులు నమోదు కావడంపై పీవీపీ కూడా స్పందించారు. కేసులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. వంద కేసులు పెట్టినా తాను పట్టించుకోనన్నారు. తప్పు చేసిన వ్యక్తిని తప్పు అనడమే నా తప్పంటే ఒప్పుకోనని.. హైకోర్టు ఆదేశాల ప్రకారమే తాము నడుచుకుంటున్నామని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు తమ స్తలంలో పనులు చేపట్టామని తేల్చిచెప్పారు. ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టడమే వివాదానికి దారితీసినట్లు తెలుస్తోంది.

పొట్లూరి వరప్రసాద్ ఇంటి కాంపౌండ్ వాల్ పనులు చేస్తున్న సమయంలో శృతిరెడ్డి అక్కడికి వచ్చి కూలీలను నెట్టేసి ప్రహారిని ధ్వంసం చేయడమే కాకుండా అక్కడే ఉన్న తనను దూషించారంటూ ఎలీషాబాబు అనే కూలీ ఆరోపించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్