Begin typing your search above and press return to search.

వీవీ ప్యాట్లపై 21 పార్టీల పిటిష‌న్ పై సుప్రీం ఓకే!

By:  Tupaki Desk   |   3 May 2019 12:33 PM IST
వీవీ ప్యాట్లపై 21 పార్టీల పిటిష‌న్ పై సుప్రీం ఓకే!
X
దేశ వ్యాప్తంగా సాగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఒక కీల‌కాంశంపై 21 రాజ‌కీయ‌పార్టీలు సుప్రీంకోర్టులో వేసిన రివ్యూ పిటిష‌న్ కు దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం ఓకే చెప్పింది. ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు సంద‌ర్భంగా వీవీ ప్యాట్ల‌లోని స్లిప్పుట్లో 50 శాతం లెక్కించాలంటూ 21 పార్టీలు తాజాగా ఒక రివ్యూ పిటిష‌న్ ను వేశాయి. దీనిపై విచార‌ణ జ‌రిపేందుకు ఓకే చెప్పిన సుప్రీంకోర్టు.. వ‌చ్చే వారం విచార‌ణ చేప‌ట్ట‌నుంది.

ఈ అంశంపై త్వ‌ర‌గా విచార‌ణ చేప‌ట్టాల‌ని ప్ర‌తిప‌క్షాల త‌ర‌పు న్యాయ‌వాది అభిషేక్ మ‌ను సింఘ్వి సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిని కోరారు. దీనిపై స్పందించిన ఆయ‌న‌.. వ‌చ్చే వారం దీనిపై విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు చెప్పారు. వాస్త‌వానికి ఇదే అంశంపై గ‌తంలోనూ రాజ‌కీయపార్టీలు సుప్రీంకోర్టులో పిటిష‌న్ జారీ చేయ‌టం.. దీనిపై విచార‌ణ జ‌ర‌గ‌టం తెలిసిందే. వీవీ ప్యాట్ల‌లో యాభై శాతం ఓట్ల లెక్కింపు సుదీర్ఘ‌మైన‌ద‌ని.. దీనికి భారీ ఎత్తున వ‌న‌రులతో పాటు.. ఫ‌లితాన్ని విడుద‌ల చేయ‌టంలో ఆల‌స్య‌మ‌వుతుంద‌ని ఈసీ పేర్కొంది.

దీంతో.. మ‌ధ్యేమార్గంగా సుప్రీంకోర్టు అప్ప‌ట్లో నిర్ణ‌యం తీసుకుంది. దీని ప్ర‌కారం ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో 5 వీవీ ప్యాట్ల‌లో స్లిప్పుల‌ను లెక్కించాల‌ని నిర్ణ‌యించారు. ఇదిలా ఉంటే.. ఈ తీర్పుపై 21 రాజ‌కీయ పార్టీలు మ‌రోసారి సుప్రీంను ఆశ్ర‌యించాయి. రివ్యూ పిటిష‌న్ ను దాఖ‌లు చేసి.. యాభై శాతం వీవీ ప్యాట్ స్లిప్పుల‌ను లెక్కించ‌టం త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని కోరారు. దీనిపై సాధ్యాసాధ్యాల‌తో పాటు.. రాజ‌కీయ పార్టీల వాద‌న‌ను సుప్రీం మ‌రోసారి విచార‌ణ చేప‌ట్ట‌నుంది.