Begin typing your search above and press return to search.

స్టేట్ బ్యాంక్ ‘పైసా వసూల్’

By:  Tupaki Desk   |   7 Sept 2017 10:04 AM IST
స్టేట్ బ్యాంక్ ‘పైసా వసూల్’
X
సామాన్యుడిపై బ్యాంకులు ఏమాత్రం దయ చూపడం లేదు. ఎన్ని రకాలుగా డబ్బు గుంజాలో అన్ని రకాలుగా గుంజుతున్నాయి. ముఖ్యంగా మినిమం బ్యాలన్స్ మెంటైన్ చేయని ఖాతాలపై జరిమానా విషయంలో కఠినంగా ఉంటూ భారీ ఆర్జిస్తున్నాయి. ఈ విషయంలో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ముందుంది. ఇలాంటి ఖాతాల నుంచి ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే ఆ బ్యాంకు ఏకంగా రూ.235.06 కోట్లను రాబట్టింది.

సమాచార హక్కు చట్టం ద్వారా నీముచ్‌ కు చెందిన ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్‌ గౌడ్‌ దాఖలు చేసిన దరఖాస్తుకు ఎస్‌ బీఐ ఇచ్చిన సమాధానంలో ఈ సంగతి వెల్లడైంది. మొత్తం 388.74 లక్షల అకౌంట్ల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసినట్టు ఎస్‌ బీఐ తెలిపింది.

కాగా బ్యాంకులు ఇలా వ్యవహరిస్తుండడంపై అంతటా నిరసన వ్యక్తమవుతోంది. పేదలు రూ.5 వేల కనీస బ్యాలన్స్ నిర్వహించలేకపోతున్నారని... అదేమీ పట్టించుకోకుండా బ్యాంకులు ఇలా వారిపై జరిమానా విధించడం కరెక్టు కాదని అంటున్నారు. గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భరత్ సోలంకి దీనిపై తన ట్విట్టర్ ఖాతాలో ఆవేదన వ్యక్తం చేశారు. పేదలుగా ఉన్నందుకు పేదలకు జరిమానా విధిస్తున్నామా మనం అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.