Begin typing your search above and press return to search.
ఆరు బ్యాంకులని ముంచి..విదేశాలకి పారిపోయిన మరో మాల్యా!
By: Tupaki Desk | 9 May 2020 6:30 PM ISTమన దేశంలో రోజురోజుకి విజయ్ మాల్యాలు పెరిగిపోతున్నారు. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని, వాటిని తీర్చుకుండా విదేశాలకు పారిపోయిన మరికొందరు వెలుగులోకి వచ్చారు.ఆరు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని విదేశాలకు పారిపోయారు. దీంతో బ్యాంకుల కన్సార్షియం తరఫున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీబీఐకి ఫిర్యాదు చేసింది. రామ్ దేవ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ప్రమోటర్స్ మీద ఎస్ బీఐ సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఆ సంస్థ డైరెక్టర్లు నరేష్ కుమార్, సురేష్ కుమార్, సంగీత ఆరు బ్యాంకుల నుంచి రూ.411 కోట్ల రుణాలు తీసుకుని ఇప్పుడు విదేశాలకు పారిపోయారంటూ ఫిర్యాదులో తెలిపింది.
ఈ రామ్ దేవ్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ భారత్ నుంచి బాస్మతీ రైస్ ను విదేశాలకు ఎగుమతి చేస్తుంది. కొన్ని పశ్చిమాసియా దేశాలు, ఐరోపా దేశాలకు బాస్మతి బియ్యం ఎగుమతి చేస్తూ ఉంటుంది. ఆ కంపెనీ ఎస్ బీఐ నుంచే రూ.173 కోట్ల రుణాలు తీసుకుంది. కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్ నుంచి కూడా రుణాలు తీసుకుంది.
ఢిల్లీలో బాస్మతి బియ్యం ఎగుమతిదారుడైన నరేష్ కుమార్ అనే ఈ వ్యక్తికి సురేష్ కుమార్, సంగీత అనే వ్యక్తులతో బాటు మరికొందరు కూడా సహకరించారు. రామ్ దేవ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనే సంస్థకు వీళ్ళు తమను తాము డైరెక్టర్లుగా చెప్పుకున్నారు. 2016 లో వీరి ఆస్తుల గురించి ఎస్ బీ ఐ ఆరా తీయగా అసలు విషయం వెల్లడయింది. అప్పటికే వీరు దేశం నుంచి ఉడాయించారు. ఎస్ బీ ఐ ఫిర్యాదు మేరకు సీబీఐ వీరిపై కేసు నమోదు చేసింది. వీరిని ఈ సంస్థ పరారీదారులుగా ప్రకటించింది.అయితే, ప్రస్తుతం కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల సీబీఐ ఎలాంటి విచారణ ప్రస్తుతానికి చేయలేదని అధికారులు చెబుతున్నారు. మొదట నిందితులకు నోటీసులు జారీ చేస్తారని, ఆ తర్వాత నిందితుల స్పందనను బట్టి చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు.