Begin typing your search above and press return to search.

నా భార్యను తన భార్య అంటున్నాడు ..కార్పొరేటర్ భర్త ఆవేదన, సూసైడ్ సెల్ఫీ వీడియో ..!

By:  Tupaki Desk   |   21 Feb 2020 5:30 PM IST
నా భార్యను తన భార్య అంటున్నాడు ..కార్పొరేటర్ భర్త ఆవేదన, సూసైడ్ సెల్ఫీ వీడియో ..!
X
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి చిన్న విషయం వైరల్ అవుతుంది. ఏ వార్త అయినా కూడా క్షణాల్లో ప్రపంచం చుట్టేస్తున్నాయి. ఇక స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి ప్రపంచం మన చేతిలో ఉన్నట్లే అవుతుంది. అంతే కాదు సెల్ఫీ లు వచ్చినప్పటి నుంచి మరిన్ని దారుణాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సెల్ఫీ మోజులు పడి తాము ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితికి జనాలు వెళ్తున్నారు. మరికొంత మంది దారుణమైన పనులు చేస్తూ సెల్ఫీలు తీసుకుంటున్నారు.. అవి సోషల్ మీడియా లో అప్ లోడ్ చేస్తున్నారు. మరికొంత మంది సెల్ఫీలు వీడియోలు తీసుకొని ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఈ మధ్య ఎదో ట్రెండ్ గా మారింది. తాము ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నామో ..సెల్ఫీ వీడియో తీసుకోని అందరికి తెలిసేలా చెప్పి , ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు.

సొంతవారి చేతిలో మోసపోయి కొందరు.. భర్త చేత బాదపడ్డ భార్య, భార్య ఒత్తిడి తట్టుకోలేని భర్త , కుటుంబ కలహాల వల్ల మరికొందరు.. ప్రేమికులు, అప్పులు భరించలేక ఇలా ఎన్నో కారణాల వల్ల సెల్ఫీ వీడియోలు తీసుకొని చనిపోతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన మహిళా కార్పొరేటర్ భర్త నరేష్‌ తీసిన సెల్ఫీ వీడియో ప్రస్తుతం నెట్లో హాట్ టాపిక్ గా మారింది. న భార్యను ఎవరో వ్యక్తి తన భార్య అంటూ వేధిస్తున్నాడని కార్పొరేటర్ భర్త నరేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనను చంపుతానని బెదిరిస్తున్నాడని తన ఆవేదనని తెలియజేసాడు. ఆకాష్ అనే వ్యక్తి నా భర్యను తన భార్యగా ప్రచారం చేసుకుంటున్నాడని ఆరోపించాడు. నీ భార్యను తీసుకెళ్తానంటూ నన్ను బెదిరిస్తున్నాడని కన్నీరు పెట్టుకున్నాడు.

నన్ను చంపేస్తానంటూ తరచూ బెదిరిస్తున్నాడని, ఆకాష్ పెట్టే టార్చర్ భరించలేక పోతున్నానని, అందుకే తాను సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నానంటూ వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇకపోతే , నరేష్ భార్య కోమలి ప్రస్తుతం టీఆర్ఎస్‌ పార్టీలో ఉన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 10వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌ గా ఆమె గెలుపొందారు. కాగా, నరేష్ సెల్ఫీ వీడియో గురించి కుటుంబ సభ్యులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నరేశ్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.