Begin typing your search above and press return to search.
ప్రతి రోజు 15 నిముషాల నడకతో లక్ష కోట్ల డాలర్లు ఆదా !
By: Tupaki Desk | 2 Dec 2020 5:00 AM ISTఆరోగ్యం ,,, అన్నింటికి ప్రధాన మూలం. ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్ని చేసినా , ఎంత సంపాదించినా కూడా వృధానే. అందుకే ఆరోగ్యమే మహా భాగ్యం అని అంటారు. అయితే ఆరోగ్యం బాగుండాలి అంటే ప్రతి రోజు వ్యాయామం తప్పనిసరి. వ్యాయామం చేస్తూ చురుకైన జీవనశైలి పాటిస్తున్న ఉద్యోగులకు ఎక్కువ ఆయుష్షు పొందడమే కాదు, అతని కుటుంబం, పని చేసే సంస్థ, దేశ ఆర్థికాభివృద్ధికి ప్రత్యక్షంగా దోహదపడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మద్యే వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రజల ఆరోగ్యం ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని మరోసారి పునరుద్ఘాటించింది. మనదేశంలోని విద్యావంతుల్లో అధిక శాతం కూర్చుని పనిచేసేందుకు ఎక్కువగా ఇష్టపడతారు.
ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో ఉద్యోగులను రోగాలు చుట్టుముట్టేందుకు ఎంతోకాలం పట్టడంలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్న జబ్బు వచ్చి ప్రైవేటు ఆసుపత్రిలో చేరితే.. అంతవరకు సంపాదించింది క్షణాల్లో కరిగిపోతున్న ఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం. రాష్ట్రంలో ముఖ్యంగా నగరాల్లో ప్రభుత్వ, ప్రైవేటు, ఐటీ రంగాల్లో పనిచేసే లక్షలాది మందిలో అధిక శాతం కంప్యూటర్ల మీదనే ఆధారపడి పనిచేస్తున్నారు. ఇలాంటి వారందరికీ ఈ సర్వే ఓ మేలుకొలుపు లాంటిదని వైద్యులు సూచిస్తున్నారు. పావుగంట నడిస్తే.. అన్ని రోగాలను దూరం పెట్టినట్లేనని స్పష్టంచేస్తున్నారు.
చికిత్స కంటే నివారణ మేలు అన్న నినాదం ప్రకారం.. జబ్బులు వచ్చాక జాగ్రత్త పడటం కంటే దానికి దూరంగా ఉండేలా ప్రతీరోజూ అదనంగా 15 నిమిషాలు నడవాలని ఈ సర్వే చెబుతోంది. దానివల్ల ప్రతీ ఉద్యోగి పనితీరులో మెరుగైన ప్రదర్శన కనిపిస్తున్నట్లు కూడా గుర్తించింది. ఇలా రోజూ వాకింగ్, జాగింగ్ చేసే వారు ఆసుపత్రులకు తక్కువగా వెళ్తున్నారని, తద్వారా తమ ఆరోగ్యాన్ని, ఆర్థిక స్థితిని భద్రంగా ఉంచుతూ దీర్ఘాయువులుగా జీవిస్తున్నారని వెల్లడించింది. 18 ఏళ్ల నుంచి 64 ఏళ్ల మధ్యవారిలో రోజుకు 15 నిమిషాలు నడవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఏటా 100 బిలియన్ డాలర్లు అంటే మన లక్ష కోట్ల డాలర్లు ఆదా అవుతాయని ప్రకటించింది. మన కరెన్సీలోకి మారిస్తే.. దీని విలువ దాదాపు రూ.73 లక్షల కోట్ల మేర ఉంటుందని తెలిపింది. ప్రతీరోజూ నడక ఆరోగ్యానికి ఎంతో మంచిది.