Begin typing your search above and press return to search.

లాక్ డౌన్: భార్యల నుంచి కాపాడండి: సీఎంకు పురుషుల లేఖ

By:  Tupaki Desk   |   22 April 2020 3:45 AM GMT
లాక్ డౌన్: భార్యల నుంచి కాపాడండి: సీఎంకు పురుషుల లేఖ
X
ట్రెయిన్ రివర్స్ అవ్వడం అంటే ఇదే.. ఇన్నాళ్లు భర్తల నుంచి కాపాడండి అంటూ భార్యలు రోడ్డెక్కేవారు. మహిళల రక్షణకు చట్టాలు, పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. మరి పాపం భర్తలు ఏం చేశారు.. వాళ్ల బాధలు ఎవరికి చెప్పుకోవాలి? లాక్ డౌన్ తో నెలరోజులుగా ఇంటికే బందీ అయి పోయిన భర్తలను భార్యలు తీవ్రంగా వేధిస్తున్నారట.. ఊరికే తిని కూర్చుంటున్న భర్తలను లోకువగా చూస్తున్నారట.. వారి గృహహింసతో ఇప్పుడు భర్తలంతా కుయ్యో మొర్రో అంటున్నారు.బయటకు చెబితే పరువు పోతుందని ఉగ్గబట్టుకుంటున్నారు.

అయితే తమిళనాడు భర్తలు మాత్రం వాళ్ల భార్యల గృహహింసను తట్టుకోలేక బయటకొచ్చారు. తమను రక్షించండి మహోప్రభో అని తమిళనాడు సీఎంకు వినతిపత్రం అందించారు. వెంటనే హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి భార్యల నుంచి రక్షించండి అంటూ మొరపెట్టుకున్నారు.

ఇళ్లకే పరిమితమైన భర్తలను భార్యలు తీవ్రంగా వేధిస్తున్నారని తమిళనాడు పురుషుల రక్షణ సంఘం అధ్యక్షుడు, న్యాయవాది అరుళ్ తమిళన్ తాజాగా తమిళనాడు సీఎం ఫళని స్వామికి ఒక వినతిపత్రం అందించారు.

లాక్ డౌన్ తో ఇంట్లో ఉంటున్న భర్తలను భార్యలు భౌతికంగానే కాదు.. మానసికంగానూ బాధ పెడుతున్నారని పురుషుల సంఘం అధ్యక్షుడు అరుళ్ వినతిపత్రంలో పేర్కొన్నారు. మహిళా రక్షణ, సంక్షేమ చట్టాలను చూపి భర్తలను భయపెడుతున్నారన్నారు. భార్యలకు సపోర్టుగా పోలీసుల ప్రకటనలు కూడా భర్తలను మరింత ఆవేదనకు గురిచేస్తున్నాయన్నారు. మగవారి బాధలను తెలుపుకునేందుకు వెంటనే ఒక హెల్ప్లైన్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.