Begin typing your search above and press return to search.

క్రేజీ గేమ్ పై నిషేధాన్ని విధించారు!

By:  Tupaki Desk   |   21 July 2016 1:54 PM GMT
క్రేజీ గేమ్ పై నిషేధాన్ని విధించారు!
X
సాధారణంగా మూగజీవాలకు సంబందించిన ఆటలపై నిషేదాన్ని విధించడం, కొన్ని దేశాల్లో వాట్సప్ ను ఆపెయ్యడం వంటివి సర్వసాధారణంగా జరుగుతుంటాయి. అయితే తాజాగా ఒక జీపీఎస్ బేస్డ్ గేం పై సౌదీ మతపెద్దలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా క్రేజీ గేమ్ అయిన పోకిమాన్ గో కు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకోవడం ఒకింత ఆశ్చర్యాన్నికి గురిచేసిందనే చెప్పాలి. దీనికి సంబందించి 'పోకీమాన్ గో' కు వ్యతిరేకంగా ఫత్వా కూడా జారీ చేశారు.

ఈ గేమ్ ను ఆపెయ్యడంపై రకరకాల అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అయితే ఇస్లామిక్ కు వ్యతిరేకంగా ఉన్నందుకే ఈ ఆటను నిషేధిస్తున్నామని సౌదీ మతగురువులు ప్రకటించారు. కాగా ఈ జీపీఎస్ బేస్డ్ పొకేమాన్ గో గేమ్ సృష్టిస్తున్న ప్రకంపనలు వరసగా ఒక్కో దేశాన్ని తాకుతున్న సంగతి తెలిసిందే. వాస్తవప్రపంచానికి - కాల్పనిక ప్రపంచానికి ముడిపెడుతూ రూపొందిన ఈ క్రేజీ గేమ్ ను సైనిక - పోలీసు ఉద్యోగులు వాడటంపై ఇండోనేషియా దేశం పాక్షిక నిషేధం విధించింది. ఈ రంగాలకు సంబందించిన ఏ ఉద్యోగీ ఈ ఆటను డ్యూటీలో ఉండగా ఆడరాదనేది కండిషన్. కానీ.. సౌదీలో మాత్రం పూర్తిగా ఎవ్వరూ ఆడకూడదని తీసుకున్న నిర్ణయం మాత్రం సంచలనం అవుతుంది!