Begin typing your search above and press return to search.
ఆ దేశం బాదే లెక్క మోడీకి తెలీకుంటే బాగుండు దేవుడా?
By: Tupaki Desk | 12 May 2020 2:20 PM ISTవ్యక్తిత్వ వికాస నిపుణుడి తరహాలో మాట్లాడుతూ.. మనసుల్ని దోచే టాలెంట్ ప్రధాని మోడీకి ఎంత ఉందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మొత్తని మాటల్ని విన్నంతనే ఈ దేశానికి ఎలాంటి ప్రధానమంత్రి కావాలో అలాంటోడే వచ్చేశాడన్న ఫీలింగ్ కొందరిలో బలంగా ఉంటుంది. తాము అధికారంలోకి వస్తే చాలు.. విదేశాల్లో మూలిగే నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తానన్న మాటతో పాటు.. తాము పవర్లోకి వస్తే చాలు లీటరు పెట్రోల్ రూ.50కు.. డీజిల్ ధర మరింత తగ్గిస్తామని చెప్పిన మాటల్ని మర్చిపోతే ఫర్లేదు కానీ.. గుర్తుంటేనే ఇబ్బంది అంతా.
ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లోనూ ప్రజల నడ్డి విరిగేలా బాదేయటం.. మొహమాటం లేకుండా పిండేయటం లాంటి టాలెంట్లు మోడీ సర్కారు సొంతం. ఎక్కడి దాకానో ఎందుకు.. శ్రామిక్ రైళ్ల వ్యవహారమే తీసుకోండి.. ఈ దేశంలోని వలసకూలీల్ని వారి సొంతూళ్లకు నడిపేందుకు ఛార్జీతో పాటు.. అదనపు ఛార్జీల్ని వసూలు చేయాల్సిన అవరం ఉందా? ఇంత కష్టంలోనూ కరకుగా ఉండటం మోడీ సర్కారుకే చెల్లుతుందని చెప్పాలి.
స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లకు.. దేశం పురోగతి దిశగా పరుగులు తీస్తున్నదంటూ మాటలు చెప్పే దానికి.. ఇప్పుడు జరుగుతున్న దానికి పోలికే లేదు. అంతదాకా ఎందుకు.. క్రూడాయిల్ ధరలు కనిష్ఠ స్థాయికి చేరుకున్న వేళలోనూ.. సర్ ఛార్జితో బాదేయటం మోడీ మాష్టారికే సాధ్యం. ప్రజల వీపు పన్ను మోత మోగించటంలో ఆయనకున్న టాలెంట్ ఎంత చెప్పినా తక్కువే.
ఇలాంటివేళ.. మోహమాటం లేకుండా పన్నులు వడ్డించేలా తీసుకున్న దేశాధినేతల సమాచారం మోడీ మాష్టారికి తెలిస్తే.. దేశ ప్రజలకు ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపన్న దేశాల్లో ఒకటిగా.. చమురు నిల్వలతో ఆర్థికంగా ఒక వెలుగు వెలిగిన సౌదీ లాంటి ఎడారి దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో కిందామీదా పడుతోంది. ఆ దేశానికి బలమంతా చమురు.. టూరిజం.దాంతో పాటుగా మక్కా.. మదీనా యాత్రలు. మాయదారి రోగం పుణ్యమా అని అన్ని ఆదాయాల మీద ఒక్కసారిగా భారీగా దెబ్బ పడటంతో ఇప్పుడా దేశం కిందా మీదా పడుతోంది.
ప్రభుత్వాన్ని నడిపేందుకు అవసరమైన నిధులు లేకపోవటం.. ఆర్థిక కష్టాలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు వీలుగా సౌదీ సర్కారు కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రజలపై వేసే పన్నుల్ని మూడింతలు పెంచేసింది. ఇప్పటివరకూ ఐదు శాతం వరకు ఉన్న వ్యాట్ ను ఆదివారం నుంచి పదిహేను శాతానికి పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇలా ఒకేసారి మూడు రెట్లు పన్ను పోటును పెంచేయటంతో ధరల తీవ్రతతో ప్రజలు కిందామీదా పడుతున్నారు. ఇలాంటివి మోడీ మాష్టారికి తెలిస్తే.. జాతి కష్టంలో ఉన్నప్పుడు త్యాగం పేరుతో పన్ను భారాన్ని మోయాలని మోటివేట్ చేసినా ఆశ్చర్యం లేదు. మోడీ మాటలు విన్నప్పుడు ఆ మాత్రం చేయకపోతే ఏం బాగుంటుందనిపిస్తుంది కానీ.. ఇంటి బడ్జెట్ చూసినప్పుడు మాత్రం భోరుమనకుండా ఉండలేం. అందుకే.. పన్నుపోటు పెంచేస్తూ ఆయా దేశాలు తీసుకునే వివరాలు మోడీకి తెలీకుంటే బాగుండని దేవుడ్ని వేడుకోవటం చాలా అవసరం.