Begin typing your search above and press return to search.
రజినీకాంత్ రాజకీయ ఎంట్రీపై కట్టప్ప సెటైర్లు
By: Tupaki Desk | 7 Dec 2020 9:25 AM ISTబాహుబలితో ‘కట్టప్ప’గా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన తమిళ నటుడు సత్యరాజ్ తాజాగా రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై హాట్ కామెంట్స్ చేశారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ఎట్టకేలకు తాను జనవరిలో పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నటుడు సత్యరాజ్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి.
నటుడు సత్యరాజ్ తాజాగా రజినీకాంత్ పై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఎక్కడా రజినీకాంత్ పేరు వాడకుండానే విమర్శలు గుప్పించారు.
సత్యరాజ్ మాట్లాడుతూ ‘రాజకీయాలు చేయాలంటే వేరే విషయాలు ఆలోచించకూడదు. నమ్మిన సిద్ధాంతంతో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా పనిచేయాలి. అంతేకానీ ప్లాన్ చేసుకొని.. లెక్కలు వేసుకొని రాజకీయాలు ఎవరైనా చేస్తారా? లెక్కలు వేసుకొని చేసేదాన్ని వ్యాపారం అంటారు? గుర్తు పెట్టుకోండి’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రజినీకాంత్ సాగదీసి దీసి మరీ రాజకీయ ప్రకటన చేయడం.. అసెంబ్లీ ఎన్నికలకు నాలుగైదు నెలల ముందే ఈ ప్రకటన చేయడంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. ప్రజాసేవ కంటే సీఎం కుర్చీ కోసమే రజినీ ఇలా హడావుడిగా రాజకీయాల్లోకి వస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.