Begin typing your search above and press return to search.

కృష్ణా వైసీపీలో లేడీ లీడ‌ర్‌... సిట్టింగ్ ఎమ్మెల్యే సీటుకు ఎర్త్‌..!

By:  Tupaki Desk   |   29 July 2022 1:30 AM GMT
కృష్ణా వైసీపీలో లేడీ లీడ‌ర్‌... సిట్టింగ్ ఎమ్మెల్యే సీటుకు ఎర్త్‌..!
X
ప్ర‌స్తుత ఎన్టీఆర్ జిల్లాలోని రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం తిరువూరు నుంచి పోటీ చేసేందుకు వైసీపీలో లేడీ లీడ‌ర్ రెడీ అయ్యారు. త‌న‌కు టికెట్ ఇస్తే.. పోటీ చేస్తాన‌ని... ఖ‌చ్చితంగా గెలిచి తీరుతాన‌ని ఆమె చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కీ ఆమె ఎవ‌రంటే.. మాజీ డిప్యూటీ సీఎం, దివంగ‌త కోనేరు రంగారావు.. మ‌న‌వ‌రాలు.. స‌త్య‌ప్రియ‌. ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్న ఆమె కీల‌క‌మైన లిడ్ క్యాప్‌ కార్పొరేష‌న్ డైరెక్ట‌ర్‌గా ఉన్నారు. గ‌తంలో వైఎస్‌కు అంత్యంత ప్రియ‌మైన నాయ‌కుడిగా రంగారావు వ్య‌వ‌హ‌రించేవారు.

అయితే.. త‌ర్వాత‌.. కాలంలో వైసీపీ ఆవిర్భ‌వించిన త‌ర్వాత‌.. కోనేరు మ‌న‌వ‌రాలు.. స‌త్య‌ప్రియ వైసీపీలో చేరారు. తిరువూరులో గ‌త ఎన్నిక‌ల్లోనే ఆమె టికెట్‌ను ఆశించారు. కానీ ఇక్క‌డ నుంచి పార్టీకి అత్యంత కీల‌క‌మైన నాయ‌కుడు, వైఎస్‌కు స‌న్నిహితుడు, సీఎం జ‌గ‌న్‌కు ప్రియ‌మైన నాయ‌కుడు కొక్కిలిగ‌డ్డ ర‌క్ష‌ణ నిధి ఉన్నారు. వ‌రుస‌గా ఆయ‌న విజ‌యాలు కూడా ద‌క్కించుకుంటున్నారు. ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌ఫు న ప‌నులు కూడా చేయిస్తున్నారు.

ఇలాంటి చోట‌.. కొక్కిలిగడ్డ ర‌క్ష‌ణ‌నిధికే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటును ఇచ్చేందుకు పార్టీ రెడీగానే ఉంద‌ని అ నుకుంటున్న త‌రుణంలో.. ఇప్పుడు అనూహ్యంగా కోనేరు స‌త్య‌ప్రియ రంగంలోకి వ‌చ్చింది. మ‌రి దీనికి రీజ‌నేంటి? అనేది ఆస‌క్తిగా మారింది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేస్తాన‌ని.. స‌త్య‌ప్రియ చెప్ప‌డం వెనుక‌.. కొంద‌రు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నార‌ని చ‌ర్చ సాగుతోంది. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు.. కూడా ర‌క్ష‌ణ‌నిధికి పోటీ లేదు. పార్టీలోనూ.. ఆయ‌న‌కు తిరుగులేదు.

అలాగ‌ని ఆయ‌న వివాదాస్ప‌ద నాయ‌కుడు కాదు. కానీ, ఇటీవ‌ల మంత్రిప‌దవుల్లో తన‌కు ప్రాధాన్యం లేద ని.. త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేదని.. త‌నుచాలా సీనియ‌ర్‌న‌ని చెప్పారు. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చి ఉం టే బాగుంద‌ని అన్నారు.

అయితే.. ఈ వ్యాఖ్య‌ల వెనుక‌.. ఆయ‌న త‌న‌ను తానే హీరోగా ఊహించుకుంటు న్నార‌ని.. త‌న‌కు పోటీ లేద‌ని.. భావిస్తున్నార‌నే చ‌ర్చ‌సాగింది. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు షాక్ ఇచ్చేలా.. ఆయ‌న‌ను అదుపు చేసేలా.. కొంద‌రుకోనేరు స‌త్య‌ప్రియ‌ను రంగంలోకి దింపుతున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఈ ప‌రిస్థితి ఎటు మ‌లుప‌పు తిరుగుతుందోచూడాలి.