Begin typing your search above and press return to search.

అయేషా కేసు.. కుట్ర కోణం బయటపెట్టిన సత్యంబాబు

By:  Tupaki Desk   |   19 Jan 2019 3:45 PM IST
అయేషా కేసు.. కుట్ర కోణం బయటపెట్టిన సత్యంబాబు
X
ఎవరైనా ఆపదలో ఉంటే పోలీసులను ఆశ్రయిస్తారు. ఆ పోలీసే బాధితుడిని ఇరికించే యత్నం చేస్తే ఆ గోడు ఎవరికీ చెప్పుకోవాలి? అచ్చం ఇలాంటి సంఘటనే తన విషయంలో జరిగిందని అయేషా కేసులో నిందితుడిగా ఉన్న సత్యంబాబు సీబీఐ పోలీసుల ఎదుట తన గోడును వెల్లబోసుకున్నాడు.

అయేషా హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కొన్నాళ్లుగా అయేషా హత్య కేసుపై విచారణ జరుగుతున్న అసలు వాస్తవాలు మాత్రం ఇంతవరకూ వెలుగు చూడలేదు. కానీ ఈ కేసులో ప్రధాన ముద్దాయి అంటూ సత్యం బాబు అనే యువకుడిని కోర్టు శిక్షించిన విషయం తెల్సిందే. కొన్నాళ్ల తర్వాత సత్యం బాబు నిర్దోషి అని కోర్టు తెల్చడంతో జైలు నుంచి విడుదలయ్యాడు.

తాజాగా అయేషా మీరా కేసును కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. సీబీఐ విచారణలో సత్యంబాబు దిమ్మతిరిగే వాస్తవాలను బయటపెట్టాడు. ఈ కేసులో లక్ష్మణ్ అనే కానిస్టేబుల్ తనను అన్యాయంగా ఇరికించాడని వాపోయాడు. అయేషా కేసు విషయంలో నందిగామలో అప్పట్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ లక్ష్మణ్ స్వామి నేను పనికి వెళుతున్న సమయంలో దారిలో ఆపాడని తెలిపాడు. ఆ సమయంలో తాన వద్ద ఉన్న పాత చెప్పులు బలవంతంగా తీసుకొని వంద రూపాయలు ఇచ్చి కొత్త చెప్పులు కొనుకోమ్మడని తెలిపాడు. నాకేందుకు కొత్త చెప్పులు.. ఇచ్చిన డబ్బులు వద్దనగా తనను తీవ్రంగా కొట్టాడని సీబీఐ పోలీసులకు వివరించాడు. మరుసటి రోజు తన చెప్పులను అయేషా హత్య జరిగిన ప్రదేశంలో వేసి అదేరోజు అర్ధరాత్రి తన ఇంటికి వచ్చి అరెస్టు చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు.

పోలీస్ సిబ్బంది తమ ప్రమోషన్ల కోసం ఈ కేసులో తనను ఇరికించి బలి చేశారని ఆవేదన వెలిబుచ్చాడు. వారి మాట వినకపోతే తన తల్లిని, సోదరిని ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరించాడని తెలిపాడు. సత్యం బాబు చెప్పిన విషయాలన్నింటిని సీబీఐ పోలీసులు నమోదు చేసుకున్నారు.

అదేవిధంగా అయేషా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనేరు సతీష్ పాత్రపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. తొలిరోజు 14గంటల పాటు సతీష్ ను సీబీఐ బృందం విచారించింది. శనివారం సతీష్ కు చెందిన బ్యాంక్ లాకర్లను పరిశీలించనున్నారు. అదేవిధంగా పాస్ పోర్టును పరిశీలిస్తారు. అయేషా హత్య అనంతరం సతీష్ ఎక్కడెక్కడ ఉన్నాడనే అంశాలపై సీబీఐ క్షుణ్ణంగా ఆరా తీస్తుంది.

ఆయేషా మీరాను హత్య చేసింది ఎవరు అనేది పక్కన పెడితే ఈ కేసులో సత్యం బాబు పావుగా మారి సంఘటన అందరిని కంటతడిపెట్టిస్తోంది. ఇదిలా ఉండగా సత్యంబాబును మళ్లీ ఈ కేసులో ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ సత్యం ఇంటికి భారీగా గ్రామస్థులు చేరుకొని సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.