Begin typing your search above and press return to search.

బిల్ గేట్స్ ఎఫైర్ పై స్పందించిన సత్యనాదెళ్ల

By:  Tupaki Desk   |   22 May 2021 8:30 AM GMT
బిల్ గేట్స్ ఎఫైర్ పై స్పందించిన సత్యనాదెళ్ల
X
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ తన సంస్థలోని ఒక మహిళతో సంబంధం కలిగి ఉన్నాడని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలోనే ఆయన భార్య మెలిండా విడాకులు ఇచ్చినట్టు ప్రచారం సాగింది. 20 ఏళ్ల క్రితం వచ్చిన ఈ ఆరోపణలే బిల్ గేట్స్ విడాకులు తీసుకుంటున్న నేపథ్యంలో మళ్లీ వెలుగులోకి వచ్చాయి.

ఈ వివాదంపై మైక్రోసాఫ్ట్ ప్రస్తుత సీఈవో సత్యనాదెళ్ల స్పందించారు. ఒక మీడియాతో మాట్లాడిన ఆయన 2021 మైక్రోసాఫ్ట్ సంస్థ.. 2000 నాటి మైక్రోసాఫ్ట్ కంటే చాలా భిన్నమైనది అని అన్నారు. బిల్ గేట్స్ విషయాన్ని ఎవరైనా లేవనెత్తవచ్చు.. 20 క్రితం నాటి సంగతి గురించి మీరు మాట్లాడుతున్నారు. అప్పుడే ఈ విషయంపై తాము విచారణ జరిపాం. దానిపై అందరూ సంతృప్తి చెందే విధంగా కార్యచరణ జరిపాం. ఈ విషయంలో మాపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు.’ అని సత్యనాదెళ్ల చెప్పుకొచ్చారు.

మేము ఇప్పటికీ మైక్రోసాఫ్ట్ లో మంచి వాతావరణం ఏర్పాటు చేశామని.. మన సంస్కృతి, వైవిధ్యం గురించి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తామని సత్యనాదెళ్ల తెలిపారు. మైక్రోసాఫ్ట్ లో ఏ సమస్య వచ్చినా విచారణ జరిపి పరిస్థితులు తెలుసుకొని చర్యలు చేపడుతాం అన్నారు.

20 ఏళ్ల క్రితం బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉద్యోగితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడంతో కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే బయటి న్యాయ సంస్థతో బోర్డు కమిటీ విచారణ జరిపి సమీక్షించింది. 20 ఏళ్ల క్రితం వ్యవహారం స్నేహపూర్వకంగా ముగిసిందని తేల్చారు. ఆమెను సంస్థ నుంచి పంపించి వేశారని తెలిపారు.