Begin typing your search above and press return to search.

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల మృతి

By:  Tupaki Desk   |   1 March 2022 8:30 AM GMT
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల మృతి
X
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల ఇంట్లో విషాదం నెలకొంది. సత్య నాదెళ్ల 26 ఏళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల మృతిచెందారు. పుట్టుకుతోనే మస్తిష్క పక్షవాతం వ్యాధితో బాధపడుతున్న జైన్.. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం తీవ్ర అనారోగ్యానికి గురై మరణించాడు.

2014లో సీఈవో బాధ్యతలు సత్యానాదెళ్ల స్వీకరించారు. వైకలాల్యున్నా వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు ఉత్పత్తుల రూపకల్పనపై కంపెనీని దృష్టి సారించారు. అలాగే కుమారుడు జైన్ అంటే సత్యకు ప్రాణం.

సత్యా తన కుమారుడు లేవలేకపోవడంతో పలు శ్రద్ధలు తీసుకునేవారు. 2021లో జైన్ కు ఎక్కువగా చికిత్స చేసిన చిల్డ్రన్ హాస్పిటల్, సీటెల్ చిల్డ్రన్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ బ్రెయిన్ రీసెర్చ్ లో భాగంగా పీడియాట్రిక్ న్యూరోసైన్సెస్ లో జైన్ నాదెళ్ల ఎండోడ్ చైర్ ను స్తాపించారు.

జైన్ నాదెళ్ల సెరిబ్రల్ పౌల్సీ వ్యాధితోనే జన్మించాడు. పుట్టుకతోనే బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి. ఈ వ్యాధి వల్ల మెదడుకు కాళ్లు, చేతులతో పట్టు తప్పి పోతుంది. ఏమాత్రం కంట్రోల్ ఉండదు. నడవలేని స్తితిలో ఉండడం వల్ల వీల్ చైర్ కే పరిమితం కావాల్సి ఉంటుంది.జైన్ నాదెళ్ల పరిస్థితి కూడా అలాగే ఉండేది.

కొడుకు వీల్ చైర్ కే పరిమితం కావడంతో సత్య నాదెళ్ల కుటుంబం ఎంతగానో కుంగిపోయింది. అయితే ఆ బాధను దిగమింగుకొని తన కొడుకు లాంటి వారి కోసం వినూత్న పరికరాలపై నాదెళ్ల దృష్టిపెట్టారు. మైక్రోసాప్ట్ సీఈవో గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అంగవైకల్యం ఉన్న వారు కూడా సులువుగా ఉపయోగించుకునేలా మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల్లో అనేక కొత్త మార్పులను తీసుకొచ్చారు. సత్యనాదెళ్లకు జైన్ తోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.