Begin typing your search above and press return to search.

పార్టీ న‌న్ను సవ‌తికొడుకులా చూస్తోందంటున్న ఎంపీ

By:  Tupaki Desk   |   5 Feb 2018 5:10 AM GMT
పార్టీ న‌న్ను సవ‌తికొడుకులా చూస్తోందంటున్న ఎంపీ
X
ఇటీవ‌లి కాలంలో సొంత పార్టీ అయిన బీజేపీ - ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డుతున్న ఆ పార్టీ సీనియర్‌ నేత - ఎంపీ శత్రుఘ్న సిన్హా మ‌రోమారు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మాజీ కేంద్ర‌ యశ్వంత్‌ సిన్హా ఇటీవల ప్రారంభించిన 'రాజకీయేతర' వేదిక 'రాష్ట్ర మంచ్‌'లో చేరిన ఆయన ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ తనను సవతి కొడుకులా చూసిందని ఆరోపించారు. ఇక ఇప్పుడు తాను స్వేచ్ఛా వాదినని అన్నారు.

బీజేపీలో తాను అణిచివేతకు గురయ్యాననీ - మాట్లాడటం తప్పే మరేమీ చేయడానికి పార్టీ తనను అనుమతించలేదని సిన్హా చెప్పారు. 'మాతృక పార్టీలో సభ్యుడిగా ఉండి బహిరంగ సభ్యుడిగా ఉండటం తప్ప మరే ప్రయోజనంలేదు. సవతి కొడుకును చూసినట్టు ఆ పార్టీ నన్ను చూసింది. నిజాయితీగా చెప్పాలంటే.. నేను అణచివేతకు గురయ్యాను' అని సిన్హా అన్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ పాలనపై తన అభిప్రాయాలు పంచుకునే వేదిక పార్టీలో లేదు. అందుకే మేం రాష్ట్ర మంచ్ ప్రారంభించాం. దీనిని పార్టీ వ్యతిరేక చర్యగా చూడరాదు. జాతీయ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని ఇది చేస్తున్నా. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో పాలుపంచుకోవాలన్నదే తన ఉద్దేశం` అని క్లారిటీ ఇచ్చారు..

పలు సందర్భాల్లో పార్టీ ఆర్థిక విధానాలపై విమర్శలు చేసిన మాజీ ఆర్థిక మంత్రి య‌శ్వంత్ సిన్హా శ‌త్రుఘ్న సిన్హాతో క‌లిసి ఇటీవల 'రాష్ట్ర మంచ్‌'ను ప్రారంభించారు. బీజేపీపై బహిరంగ విమర్శలు చేస్తూ వచ్చిన శత్రుఘ్న సిన్హాతో పాటు ఇత‌ర పార్టీల నేత‌లు కూడా అందులో ఉన్నారు. కాంగ్రెస్‌ ఎంపీ రేణుకా చౌదరీ - ఎన్‌ సీపీ ఎంపీ మాజీద్‌ మెమోన్‌ - ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ - గుజరాత్‌ మాజీ సీఎం సురేష్‌ మెహతా - జేడీ(యు) నాయకుడు పవన్‌ వర్మ - ఆర్‌ ఎల్‌ డీ నాయకుడు జయంత్‌ చౌదరీ - మాజీ కేంద్ర మంత్రి సోమపాల్‌ హర్‌ మోహన్‌ ధావన్‌...మొదలైనవారు ఈ భేటీలో పాల్గొన్నారు. ఆ వేదిక ఏర్పాటు త‌ర్వాత‌నే సిన్హా ఇలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.