Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసు: షారుఖ్ కుమారుడికి నో బెయిల్.. కస్టడీ పొడగింపు

By:  Tupaki Desk   |   4 Oct 2021 3:30 PM GMT
డ్రగ్స్ కేసు: షారుఖ్ కుమారుడికి నో బెయిల్.. కస్టడీ పొడగింపు
X
క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీలో అరెస్టయిన బాలీవుడ్ హీరో షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు షాక్ తగిలింది. షారుఖ్ కుమారుడికి కోర్టు బెయిల్ నిరాకరించారు. గురువారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) కస్టడీలో ఉన్న ఆర్యన్ ఖాన్ , ఇతరులను ముంబైలోని కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు ఆర్యన్ కు షాక్ ఇచ్చింది. ఆర్యన్ ను ప్రశ్నించడానికి అక్టోబర్ 11 వరకు అతడిని కస్టడీలో ఉంచాలని డ్రగ్ నిరోధక సంస్థ కోర్టుకు చెప్పింది.

కోర్టు కస్టడీ అభ్యర్థనను తగ్గించింది. ఎన్సీబీ తదుపరి మూడు రోజులు అంటే అక్టోబర్ 7 వరకు ఓడలో రేవ్ పార్టీకి సంబంధించిన అన్ని కోణాల్లో అతడిని ప్రశ్నిస్తుంది. ఆర్యన్‌తో పాటు అతని స్నేహితుడు అర్బాజ్ మర్చంట్ , మున్మున్ ధమేచా ఎన్‌సీబీ కస్టడీలో ఉంటారు.

ఇంతలో షారూఖ్ ఖాన్ తన కొడుకు గురించి పాత వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. రెండ్రోజుల్లో సిమీ గారెవాల్ షోతో షారూఖ్ ఇలా అన్నాడు. "నేను ఆర్యన్ కు 3 లేదా 4 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు చెప్పాను. అతను అమ్మాయిల వెంట పరుగెత్తగలడు. అతను కావాల్సినంత ధూమపానం చేయవచ్చు, అతను డ్రగ్స్ తీసుకోవచ్చు. అతడు శృంగారాన్ని చేయగలడు" అని ఒక వీడియో వైరల్ అవుతోంది.

అయితే ఈ వ్యాఖ్యలు తేలికపాటి వ్యాఖ్యలుగా కొందరు కట్టిపడేస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో షారుఖ్ ఖాన్ పై మాటలతో విరుచుకుపడుతున్నారు. నెటిజన్లు బాలీవుడ్ హీరోని కనికరం లేకుండా ట్రోల్ చేస్తున్నారు.