Begin typing your search above and press return to search.
రాహుల్ దెబ్బకు చోటా భీమ్ షాక్
By: Tupaki Desk | 5 March 2016 1:44 PM ISTకాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మొన్న పార్లమెంటులో మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.. ఆ సందర్భంగా ఆయన కేంద్రానివి 'ఫెయిర్ అండ్ లవ్లీ' స్కీములు అంటూ రాహుల్ ఏకిపారేసిన సంగతీ తెలిసిందే. రాహుల్ ప్రసంగానికి కేంద్రం సమాధానం కూడా చెప్పుకోలేకపోయింది. అంతేకాదు... రాహుల్ ప్రసంగానికి చాలామంది మెచ్చుకున్నారు కూడా. రాహుల్ ధాటికి బీజేపీ కాస్త బిత్తరపోయిందనే చెప్పాలి. లోక్ సభలో ఆయనకు గట్టి కౌంటర్ కూడా ఇవ్వలేకపోయింది. అయితే... సోషల్ మీడియాలో మాత్రం రాహుల్ ప్రసంగం నేపథ్యంలో తాజాగా వచ్చిన ఓ వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.
రాహుల్ గాంధీ ఓ వైపు వీర లెవెల్లో ప్రసంగిస్తుంటే ఇంకో వైపు చిన్నారుల కామిక్ హీరో చోటా భీమ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు. ఇప్పుడు ఈ వీడియో వాట్స్ యాప్ - ఫేస్ బుక్ లలో తెగ వ్యాపిస్తోంది. దేశీ స్టఫ్ అనే సంస్థ యానిమేట్ చేసిన ఈ వీడియో నెటిజన్లను భలే ఆకట్టుకుంది. ఈ వీడియో చూసిన వారు పెట్టే కామెంట్లు కూడా తక్కువేం కాదు. ప్రజల్లో ఉన్న హ్యూమరాలజీ మొత్తం అక్కడే కనిపిస్తోంది.