Begin typing your search above and press return to search.
మోడీ సాఫ్ట్ వేర్ ను క్రాక్ చేసిన సోషల్ మీడియా!
By: Tupaki Desk | 19 May 2019 10:49 AM ISTఅన్నిసార్లు అనుకున్నట్లు జరిగితే మనిషి కాస్తా దేవుడైపోడు. మామూలు మనిషికి మోడీకి తేడా లేదా ఏమిటి? అన్న క్వశ్చన్ వేయటం తప్పేం లేదు కానీ.. మోడీ లాంటోళ్లను ఈ దేశం ఎంతో కాలంగా చూస్తున్నదే. కొన్నిసందర్భాల్లో మంచి మనసుతో నమ్మేసినా.. ఆ వెంటనే ఎవరూ చెప్పకుండానే మేల్కొనే తీరు దేశ ప్రజల్లో కనిపిస్తుంది. ఈ కారణంతోనే.. అప్పటివరకూ భుజాల మీద మోసిన వారు.. నిర్మోహమాటంగా కింద పడేసిన వైనాలు కనిపిస్తాయి.
తమకు తిరగులేదని.. తామేం చెబితే అదే వేదంగా భావించిన చాలామంది భారతదేశంలో అడ్రస్ లేకుండా పోవటం కనిపిస్తుంది. దీనికి ఎవరూ అతీతం కాదు. రాజకీయాల్లో అప్ ట్రెండ్ మాత్రమే ఉంటుందని డౌన్ ట్రెండ్ ఉండదని నమ్మనోళ్ల నమ్మకాల్ని ఓటుతో పటాపంచలు చేసిన క్లాసిక్ ఎగ్జాంఫుల్స్ చాలానే ఉన్నాయి.
కేవలం మీడియా మాత్రమే ఉన్న రోజుల్లోనే దేశ ప్రజలు తమ విలక్షణమైన తీర్పును ఇచ్చినప్పుడు.. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరెంత చైతన్యంగా ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మెలో డ్రామాను పండిస్తూ.. ప్రధాని కుర్చీలో కూర్చున్న మోడీ తన సాఫ్ట్ వేర్ ను వెనువెంటనే మార్చుకోవాల్సిన అవసరం ఉందా? అంటే అవునని చెప్పాలి.
ఇప్పటికే పలుమార్లు తన తీరుతో ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్న ఆయన.. తాజాగా తన ఏకాంత ధ్యానం ఎపిసోడ్ లో అట్టర్ ప్లాప్ అయ్యారు. అక్కడెక్కడో ఉన్న హిమాలయాల్లోని కష్టతరమైన కేదార్ నాథ్ టెంపుల్ కు రెండు కిలోమీటర్ల దూరంలో ఏకాంత ధ్యానం ప్రోగ్రాం పాజిటివ్ కంటే నెగిటివ్ గా మారటం సోషల్ మీడియాలో కొట్టొచ్చినట్లు కనిపించక మానదు.
ఇటీవల కాలంలో మోడీ చెప్పే మాటలు.. చేసే చేతలు తరచూ విమర్శల పాలవుతున్నాయి. తాజాగా ఏకాంత ధ్యానం కూడా ఇదే కోవలోకి వెళ్లిందని చెప్పాలి. సోషలో మీడియాలో ఏకాంత ధ్యానంపై భారీగా సెటైర్లు పడ్డాయి. ఎటకారం చేసేసుకున్న వారంతా తమదైన శైలిలో కామెంట్లు పెట్టారు. అలాంటి ఎటకారాలకు బెస్ట్ ఎగ్జాంఫుల్ గా కెమెరా తీసుకెళ్లి ధ్యానం చేసిన మొదటి ప్రధాని అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చూస్తే అర్థమయ్యేది ఒక్కటే.
మోడీ తీరు ఇప్పుడేం మారలేదు. మొదట్నించి ఉన్నదే.. ఇప్పుడు కాస్త ఎక్కువైందంటే. ఐదేళ్ల క్రితం మోడీ వెర్షన్ కొత్తగా అనిపించింది. ఐదేళ్ల ఆయన పదవీకాలంతో ఆయన సాఫ్ట్ వేర్ ను చూసే అవకావం కలగటమేకాదు.. క్రాక్ చేసే సమయం దక్కింది. ఒక్కసారి దృష్టి పెట్టి.. లోతుల్లోకి వెళ్లటం మొదలెడితే.. ఎంత పెద్ద సాఫ్ట్ వేర్ అయినా అర్థంకాక మానదు. అందుకు మోడీ మినహాయింపేమీ కాదు. చూస్తుంటే.. మోడీ తన సాఫ్ట్ వేర్ ను వెనువెంటనే అప్ గ్రేడ్ చేయాల్సిన అవసరం వచ్చిందన్న భావన కలుగక మానదు.