Begin typing your search above and press return to search.

లోకేశ్‌ పై ఈ సెటైర్లు అదిరిపోయాయి..

By:  Tupaki Desk   |   13 April 2019 9:48 AM IST
లోకేశ్‌ పై ఈ సెటైర్లు అదిరిపోయాయి..
X
నిత్యం నెటిజన్లకు టార్గెట్‌ గా చిక్కే నారా లోకేశ్ ఎన్నికల పోలింగ్ వేళ మరోసారి సెటైర్లకు టార్గెటయ్యారు. మంగళగిరిలో పోటీ చేసిన ఈ టీడీపీ ముఖ్య నేత కష్టపడి తిరుగుతూ ప్రచారం చేసినా నెటిజన్లు మాత్రం ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సంధించడం మాత్రం మానడం లేదు. ఆయన అయోమయ వ్యాఖ్యలు.. తెలుగు మాట్లాడడంలో చేసే పొరపాట్లపై ఇప్పటికే నెటిజన్లు వందల సార్లు కామెడీ చేశారు.

తాజాగా నిన్న పోలింగ్ వేళ ఫేస్ బుక్ - ట్విటర్ - వాట్సాప్ వేదికగా తెలుగు నెటిజన్లు లోకేశ్‌ ను ఆటాడుకున్నారు. పోలింగ్ జరుగుతున్నది మండు వేసవిలో కావడం.. లోకేశ్ ప్రచారంలో చెమటలు కక్కుతూ తిరిగిన ఫొటోలు టీడీపీ నేతలు షేర్ చేస్తుండడంతో నెటిజన్లు సమయోచితంగా సెటైర్లు వేశారు.

లోకేశ్ తన ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లినప్పుడు అక్కడ చాలా వేడిగా ఉందని.. ఆ ఉక్కబోతకు తట్టుకోలేకపోయిన లోకేశ్ ఆ గదిలో తల పైకెత్తి చూస్తే ఫ్యాను తిరగదు - అప్పుడు ఈవీఎం వైపు చూసేసరికి అక్కడ ఫ్యాన్ కనిపిస్తుంది.. దాన్ని నొక్కితే ఫ్యాన్ తిరుగుతుందని భావించి లోకేశ్ ఆ గుర్తును నొక్కారన్న అర్థం వచ్చేలా రూపొందించిన చిత్రాలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.

అలాగే.. ఈవీఎంలలో సైకిల్ గుర్తు నొక్కితే ఫ్యాన్ గుర్తుకు ఓటు పడుతోందన్న ఆరోపణల నేపథ్యంలోనూ కొందరు సెటైర్లు వేశారు. సైకిల్ కి వేస్తే ఫ్యాన్ ‌కి ఓటు పడుతోందంటున్నారు.. అందుకే తాను సైకిల్‌ కి ఓటు పడాలని ఫ్యాన్ గుర్తు నొక్కానని ఆయన చెబుతున్నట్లుగా మీమ్స్ క్రియేట్ చేసి షేర్ చేస్తున్నారు.

ఇలాంటివి ఇంకా చాలా సెటైర్లు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. మొత్తానికి ఎన్నికలు ఎంత ఉత్కంఠ రేపుతున్నా లోకేశ్ మాత్రం ప్రజలకు వినోదం కలిగించే మనిషిగా మారిపోయారు.