Begin typing your search above and press return to search.
మోడీ కాపీ క్యాట్ అంట
By: Tupaki Desk | 15 Jun 2016 10:03 AM ISTదేశ ప్రధాని నరేంద్ర మోడి ప్రసంగంపై ఇపుడు సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఆయన అద్భుత ప్రసంగం వెనుక సామర్థ్యం కంటే సాంకేతిక సౌలభ్యం ఎక్కువగా ఉందని కామెంట్లు వస్తున్నాయి. అవి మోడీని పూర్తిగా తేలిక చేసేలా ఉండేలా ఆసక్తికరం. ఇంతకీ ఆ విమర్శల్లో ఏముందో చూడండి.
''ప్రధానమంత్రి ప్రసంగం ఎప్పుడు విన్నా ఎంతో ఆసక్తికరంగా - ఆకట్టుకునే విధంగా - ఉద్రేక పూరితంగా ఉంటుంది కదూ! అంతలా ప్రసంగించడం ఆయనకు సాధ్యమేనా? అని సందేహిస్తున్నారా... కచ్చితంగా! ఆయనే కాదు కొద్దోగొప్పొ చదవడం వచ్చిన మీరు కూడా అనర్గళంగా ప్రసంగించవచ్చు. ఎలా అంటారా?..ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గత వారం అమెరికన్ కాంగ్రెస్ (పార్లమెంటు)లో చేసిన ప్రసంగం టెలి ప్రాంప్టర్ ను చూసి చదివిందే. ప్రధాని ప్రచార గణం చక్కటి పదాడంబరాలను దట్టించి సిద్ధం చేసిన స్క్రిప్టును ఆయన తన హావభావాలతో రక్తి కట్టించే యత్నం చేశారు. అయితే ఈ క్రెడిట్ అంతా మోడీ ఖాతాలో జమ అయింది. మోడి ప్రసంగించిన తీరుపై అమె రికా కాంగ్రెస్ సభ్యుడు ఒకరు సందేహాన్ని లేవనెత్తారు. కాంగ్రెస్ లో జరిగే ఉమ్మడి సమావేశాలలో అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా ప్రసంగించే తరహాలోనే మోడి కూడా టెలిప్రాంప్టర్‌ను ఉపయోగించారనే విషయం సామాజిక మాధ్యమంలో విస్తృత చర్చకు ఆయన తెరతీశారు. భారత్ లో పలు బహిరంగ సభలలో ప్రసంగించిన తరహాలోనే ఆయన కాంగ్రెస్ లో జరిగిన ఉమ్మడి సమావేశంలో కూడా అశువుగా ప్రసంగించారని కొంతమంది, ఇందులో ఆయన గొప్పతన మేముంది, అంతా టెలిప్రాంప్టర్ మహిమ అని మరికొంతమంది రకరకాలుగా వ్యాఖ్యానించారు. మోడి టెలిప్రాంప్టర్ ను ఉపయోగించారనడానికి నిదర్శనంగా కొన్ని ఫోటోలు ప్రవాహంలా ట్విట్టర్ లో హల్ చల్ చేస్తున్నాయి. మోడీ కి ఇరువైపులా రెండు టెలిప్రాంప్టర్లు ఉన్నట్లు ఆ ఫోటోలలో కనిపిస్తున్నది. ఇది జరిగిన కేవలం రెండు గంటల వ్యవధిలోనే టెలిప్రాంప్టర్ పద్దతిని ఉపయోగించినట్లు ధృవీకరిస్తూ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.
మీడియా కధనాల మేరకు మోడి తొలిసారిగా 2014లో టెలిప్రాంప్టర్ ను ఉపయోగించుకుని ప్రసంగించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ(ఇస్రో)లో 2014 జూన్ లో పిఎస్ ఎల్ వి ప్రయోగం సందర్భంగా ప్రసంగిస్తున్న సమయంలో మోడి తొలిసారిగా ''టెలి ప్రాంప్టర్'' విధానాన్ని ఉపయోగించుకున్నారు. ఆ తరువాత విదేశీ పర్యటనల్లో టెలి ప్రాంప్టర్ ను యధేచ్ఛగా ఉపయోగించుకుంటున్నారు. ప్రత్యేకించి ఆంగ్లంలో ప్రసంగించే సమయంలో ఆయన దీనిని ఉపయోగించుకుంటున్నారు. ప్రసంగ పాఠాన్ని బయట చదవడానికి వీలుగా స్క్రోలింగ్ చేసే మానిటర్లనే టెలి ప్రాంప్టర్లుగా చెబుతారు. తాజా సంస్కరణలతో వస్తున్న పరికరాన్ని అక్కడ ఉన్నట్లు గుర్తించడం కూడా కష్టమే'' ఇలా మోడీ కాపీ క్యాట్ అంటూ విమర్శలు - విశ్లేషణల పర్వం కొనసాగింది.