Begin typing your search above and press return to search.

మ‌రి..నాన్న ఎందుకు ఢిల్లీ ఆసుప‌త్రికి వెళ‌తారు కేటీఆర్‌?

By:  Tupaki Desk   |   6 Nov 2018 11:00 AM IST
మ‌రి..నాన్న ఎందుకు ఢిల్లీ ఆసుప‌త్రికి వెళ‌తారు కేటీఆర్‌?
X
వినేవాడు ఉంటే చెప్పేటోడు చెల‌రేగిపోతార‌ని ఊరికే అన‌రేమో. తాజాగా తెలంగాణ తాజా మాజీ మంత్రి కేటీఆర్ మాట‌ల్నివింటే ఇట్టే అర్థ‌మైపోతుంది. విప‌క్షాల‌న్న మాట వినిపిస్తే చాలు విప‌రీతంగా విరుచుకుప‌డే ధోర‌ణి కేటీఆర్‌ లో అంత‌కంత‌కూ పెరుగుతోంది. వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడ‌టం కేటీఆర్ కు ఒక అల‌వాటుగా మారుతోంది. ఎదుటోడి మీద కాస్త బుర‌ద చ‌ల్లేట‌ప్పుడు.. చ‌ల్లేటోడికి కాస్త అంటుకుంటుంద‌న్న చిన్న విష‌యాన్ని కేటీఆర్ మిస్ అవుతున్నారు. తాము చెప్పిందంతా రాసే మీడియా ఉన్న‌ప్ప‌టికీ.. వాటిల్లో ఉండే ప‌రమార్థాన్ని ఇట్టే అర్థం చేసుకునేందుకు వీలుగా సోష‌ల్ మీడియా ఉంద‌న్న సంగ‌తిని కేసీఆర్ గారి అబ్బాయి మ‌ర్చిపోతున్న‌ట్లున్నారు.

ఇప్ప‌టికే కేసీఆర్ ఢిల్లీ యాత్ర‌కు ఆసుప‌త్రి పేరు చెప్పి క‌వ‌ర్ చేస్తున్న వైనానికే సోష‌ల్ మీడియాలో స‌టైర్లు ఓ రేంజ్ లో పేలుతున్నాయి. ఏం బాబు.. వైద్యానికి ఢిల్లీ కావాల్సి వ‌చ్చిందా? కేసీఆర్ కు వైద్యం చేసేటోడు తెలంగాణ‌లో లేడా? అంటూ క్వ‌శ్చ‌న్లు వ‌స్తున్నాయి. ఇలాంటి వాటికి ఏ గులాబీ నేత స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా త‌మ స‌ర్కారు హ‌యాంలో ద‌వాఖానాల రూపురేఖ‌లు పూర్తిగా మార్చేసిన‌ట్లుగా ప్ర‌చారం చేసుకునే తీరు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.

తాజాగా త‌న ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో మాట్లాడిన కేటీఆర్‌.. గ‌తంలో నేను రాను బిడ్డో స‌ర్కార్ ద‌వాఖాన‌కు అంటూ పాట‌లు రాసుకునే వార‌ని.. ఇప్పుడేమో దాన్ని మార్చేసి.. ఇప్పుడు స‌ర్కారు ద‌వాఖాన‌కు వెళ‌తామ‌ని పాడుకుంటున్న‌ట్లుగా గొప్ప‌లు చెప్పుకుంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. మ‌రి అంద‌రూ స‌ర్కారు ద‌వాఖానాకు వెళుతున్నారు స‌రే.. మ‌రి కేసీఆర్ సారు ఎందుకని టెస్టుల కోసం ఢిల్లీకి వెళుతున్న‌ట్లు? స‌ర్కారు ద‌వాఖానాలు పోనీ.. తెలంగాణ మొత్తంలో పెద్దసారుకు వైద్యం చేసే డాక్ట‌రే లేడంటారా?