Begin typing your search above and press return to search.

ర‌క్తం మ‌రిగే బాబూ..వీటికి జ‌వాబు చెప్పండి!

By:  Tupaki Desk   |   2 Feb 2019 6:15 PM IST
ర‌క్తం మ‌రిగే బాబూ..వీటికి జ‌వాబు చెప్పండి!
X
ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు శుక్ర‌వారం అసెంబ్లీలో రెచ్చిపోయారు. కేంద్రంలోని ఎన్డీయే ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌కు నిర‌స‌న‌గా న‌ల్ల‌చొక్కా ధ‌రించి వ‌చ్చిన ఆయ‌న గ‌రంగ‌రం ప్ర‌సంగం చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను దారుణంగా మోసం చేసిందంటూ మోదీ ప్ర‌భుత్వాన్ని ఎండ‌గ‌ట్టారు. మాట‌ల మ‌ధ్య‌లో త‌న ర‌క్తం మ‌రిగిపోతోందంటూ ఆవేశంగా కొన్ని వ్యాఖ్య‌లు చేశారు.

మిగ‌తా మాట‌ల సంగ‌తెలా ఉన్నా.. త‌న ర‌క్తం మ‌రిగిపోతోందంటూ చంద్ర‌బాబు చెప్పిన మాట మాత్రం వార్తాసంస్థ‌ల‌తోపాటు సోష‌ల్ మీడియాలో బాగా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. కొంత‌మంది ఆయ‌న ప్ర‌సంగాన్ని స‌మ‌ర్థిస్తున్నారు. కేంద్ర‌ప్ర‌భుత్వానికి బాబు బాగా గ‌డ్డిపెట్టారంటూ ప్ర‌శంసిస్తున్నారు. బాబే ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు అస‌లైన ప్ర‌తినిధి అంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

మ‌రికొంత‌మంది మాత్రం చంద్ర‌బాబు ప్ర‌సంగంపై విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు. ఆయ‌న ప‌ద‌జాలాన్ని త‌ప్పుప‌డుతున్నారు. బీజేపీ ప‌నుల వ‌ల్ల త‌న ర‌క్తం మ‌రిగిపోతోందంటూ బాబు చెప్ప‌డాన్ని ఎద్దేవా చేస్తున్నారు. మూడున్న‌రేళ్ల‌పాటు మోదీ ప్ర‌భుత్వంతో స్నేహం చేసిన‌ప్పుడు మీ ర‌క్తం ఎందుకు మ‌ర‌గ‌లేదు బాబూ అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ర‌క‌ర‌కాల మీమ్ ల‌తో ఆయ‌న‌పై జోకులు పేల్చుతున్నారు. విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఆయ‌న‌కు ప‌లు ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు.

చంద్ర‌బాబు వీటికి స‌మాధానం చెప్పాల‌ట‌..

* 2008లో బేషరతుగా తెలంగాణ ఇవ్వాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాసినప్పుడు ఎందుకని రక్తం మరగలేదు?

* ఆంధ్రప్రదేశ్ కు ప్ర‌త్యేక హోదా ఇచ్చాకే ప్ర‌త్యేక‌ తెలంగాణను ప్రకటించమని అప్ప‌ట్లో కోరలేదు?

* ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతాం అని చెప్పి అధికారం లోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక మాత్రం హోదా ఇవ్వం.. ప్యాకేజీ మాత్రమే ఇస్తామ‌ని చెప్పినప్పుడు మీకు రక్తం ఎందుకు మరగలేదు?

* కేంద్రం ఇస్తామ‌న్న‌ ప్ర‌త్యేక‌ ప్యాకేజీయే మ‌హ‌ద్భాగ్య‌మ‌నుకొని అప్ప‌ట్లో వెంకయ్యనాయుడు తదితర బీజేపీ నేత‌లకు టీడీపీ నాయ‌కులు స‌న్మానాలు చేసిన‌ప్పుడు మీ ర‌క్తం ఎందుకు మ‌ర‌గ‌లేదు?

* మూడున్న‌రేళ్ల‌పాటు కేంద్రంలో ఎన్డీయే చంక‌లో ఉన్న‌ప్పుడు మీ రక్తం మ‌ర‌గ‌లేదా?

* ప్రత్యేక హోదా కోసం బంద్ లు చేసిన వాళ్ల మీద కేసులు పెట్టినప్పుడు మీ రక్తం ఎందుకు మ‌ర‌గ‌లేదు?

* రాష్ట్ర విభ‌జ‌న‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విష్య‌త్తును అంధ‌కారంలోకి నెట్టేసిన కాంగ్రెస్ తో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పొత్తు పెట్టుకున్న‌ప్పుడు మీ ర‌క్తం మ‌ర‌గ‌లేదు?