Begin typing your search above and press return to search.
హమ్మయ్య 23 కాస్త 22 అయింది..టీడీపీ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్
By: Tupaki Desk | 28 Oct 2019 11:45 AM ISTగత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏపీలో టీడీపీకి భారీ ప్రమాదం పొంచి ఉంది అని చెప్పాలి. ఇప్పటికే పలువురు ఎంపీలు టీడీపీ నుండి బీజేపీలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే..ఇక తాజాగా టీడీపీ కి విధేయుడులాంటి నాయకుడు ..గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశి టీడీపీ కి - తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. దీనితో టీడీపీ పై సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువైపోతున్నాయి. అటు ఎమ్మెల్యే గా - బలమైన టీడీపీ లీడర్ గా మంచి పట్టున్న నేత రాజీనామా చేయడంతో టీడీపీ దిక్కుతోచని స్థితిలో ఉంది. దీనికి తోడు ఇప్పుడు సోషల్ మీడియా లో సెటైర్లు కూడా పడుతుండటంతో ఇబ్బందిగా మారింది.
2014 ఎన్నికల తర్వాత 23 మంది వైసిపి ఎమ్మెల్యేలను టిడిపిలోకి పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించినందుకు చంద్రబాబుకి అలాంటి ఫలితం 2019 ఎన్నికల్లో వచ్చిందని అప్పుడే సెటైర్లు పేలాయి. ఇక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం చంద్రబాబు 23మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి లాక్కున్న దానికి దేవుడే స్క్రిప్ట్ రాశాడని - అందుకే 23 స్థానాలే దక్కాయని విమర్శలు గుప్పించారు.
ఇక తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రాజీనామాతో మరోమారు 23 మంది ఎమ్మెల్యేల అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం లో హుజుర్ నగర్ ఉప ఎన్నికలో టీడీపీ కి పోలైన అన్ని ఓట్లను కలపగా 23 సంఖ్య వచ్చిందని పీవీపీ టీడీపీ ని విమర్శించిన విషయం తెలిసిందే. చంద్రబాబు 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే సీట్లు కూడా 23 .ఇక దీనిపై పీవీపీ భగవంతుణ్ణి భక్తుణ్ణి అనుసంధానం చేసేది అంబికా దర్బార్ బత్తి - టీడీపీ కి - ఓటమిని అనుసంధానం చేసేది 23 అని సెటైర్లు పేల్చారు. తాజాగా వల్లభనేని వంశీ రాజీనామా తో 23 కాస్త 22 అయింది. ఇక ఇప్పటినుండి టిడిపికి 23 బాధ తప్పింది అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దీనితో ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమౌతున్న చంద్రబాబుకి ఈ అనుకోని కొత్త సమస్య మరింత ఇబ్బందిగా మారింది.