Begin typing your search above and press return to search.

వాళ్లను కామెడీ.. కామెడీ చేసుకుంటున్నారు

By:  Tupaki Desk   |   11 March 2017 1:49 PM GMT
వాళ్లను కామెడీ.. కామెడీ చేసుకుంటున్నారు
X
ఎంతో అతృతగా ఎదురు చూసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాయి వచ్చేశాయి. ఊహించినట్లే రెండు ఫలితాలు.. ఊహించని రీతిలో రెండూ.. కలలో కూడా అనుకోని రీతిలో మరో ఫలితం వచ్చింది. పంజాబ్ లో బంపర్ మెజార్టీతో గెలిచి.. కాలం కలిసి వస్తే. . మణిపూర్.. గోవాలోనూ పాగా వేసేందుకు వీలు చిక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ. అయినప్పటికీ ఏమాత్రం సంతోషం లేని పరిస్థితి. గెలిచి భోరున విలిపించే దుస్థితి. ఇందుకు కారణం..బీజేపీనే.

చరిత్రలో నిలిచిపోయే రీతిలో ఉత్తరప్రదేశ్ లో బీజేపీ పాగా వేసిన వైనం కాంగ్రెస్ తో సహా దేశంలోని మరే రాజకీయ పార్టీ జీర్ణించుకోలేరని చెప్పక తప్పదు. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కుల రాజకీయాలకు కేరాఫ్ చిరునామాగా చెప్పుకునే యూపీ లాంటి రాష్ట్రంలో కులాలు అతీతంగా ఓటర్లు తీర్పు ఇవ్వటం అంత చిన్నవిషయం కాదన్నది మర్చిపోకూడదు. అందుకే బీజేపీకి యూపీ ప్రజలు ఇచ్చిన తీర్పు రాజకీయ పార్టీలకు నిద్ర పట్టకుండా చేస్తోంది.

ఇదంతా ఒకఎత్తు అయితే.. ఐదు రాష్ట్రాల్లో మూడు బుడ్డ రాష్ట్రాల్లో కాంగ్రెస్ చెప్పుకోదగిన విజయం సాధించినా.. యూపీ ఫలితాన్ని చూపిస్తూ.. ఆన్ లైన్లో పలువురు కామెడీ మీద కామెడీ చేసేస్తున్నారు. రాహుల్ తో జత కట్టిన యూపీ మాజీ ముఖ్యమంత్రి (ఎన్నికల్లో ఘోరంగా ఓడిన నేపథ్యంలో) అఖిలేశ్ ను కూడా ఆన్ లైన్లో ఆడేసుకుంటున్నారు.

మార్ఫింగ్ ఫోటోలకు ఎటకారం క్యాప్షన్స్ పెట్టేసి మరీ.. ఎంత కామెడీ చేసుకోవాలో అంత కామెడీ పండిస్తున్నారు. చేత్తో పట్టుకున్న ప్లకార్డుల మీద ‘‘ఐయామ్ సారీ డాడీ’’ అని అఖిలేశ్.. ‘‘ఐయామ్ సారీ మమ్మీ’’ అంటూ రాహుల్ పట్టుకున్నట్లా తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మరొకరు ఇంకో అడుగు ముందుకేసి.. ‘‘కొడకా.. నీకీ పని సాధ్యం కాదు’’ అంటూ ములాయం చమత్కరించినట్లుగా పోస్ట్ చేసేశారు. ఇంకొందరైతే.. ఇదంతా అఖిలేశ్ వైఫల్యం కాదంటూ.. రాహుల్ ఖాతాలోకి టాన్స్ ఫర్ చేస్తూ కామెడీ చేయటం గమనార్హం. ఓటమి భారంతో భారీ విషాదంతో కూరుకుపోయిన నేతలకు.. సోషల్ మీడియా ఎటకారాలు వారిని.. వారిని అభిమానించే అభిమానులకు మరింత బాధను కలిగిస్తున్నాయనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/