Begin typing your search above and press return to search.

భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన డ్రాగన్: చైనా కుట్రను బహిర్గతం చేసిన శాటిలైట్ చిత్రాలు

By:  Tupaki Desk   |   29 Jun 2020 9:30 AM GMT
భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన డ్రాగన్: చైనా కుట్రను బహిర్గతం చేసిన శాటిలైట్ చిత్రాలు
X
వైరస్ వ్యాప్తిపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న చైనా తనకు వ్యతిరేకంగా ఉన్న దేశాలపై కుయుక్తులు పన్నుతోంది. ఈ క్రమంలో తమ దేశం నుంచి తరలివెళ్తున్న సంస్థలకు భారత్ ఆహ్వానించడంపై చైనా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. అందుకే నెల రోజులుగా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడానికి కారణమైంది. చర్చలు అంటూనే వెనక కుట్ర చర్యలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా చైనా వైఖరిని.. కుట్రలను శాటిలైట్ చిత్రాలు బహిర్గతం చేశాయి.

గాల్వన్ లోయ వద్ద సరిహద్దు వెంట చైనా అప్పటికప్పుడే నిర్మాణాలు మొదలుపెట్టింది. చైనా పక్కా ప్రణాళికతో కుట్ర చేస్తోందని తెలిసింది. అది కూడా కేవలం 33 రోజుల్లోపే పూర్తి చేసిందని తెలుస్తోంది. మే 22 జూన్ 26వ తేదీ వరకు సరిహద్దు వెంట పరిశీలిస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఉపగ్రహ చిత్రాలు ఆ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. డ్రాగన్ దేశం ఏకంగా 137 మీటర్ల మేరకు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది.

గాల్వన్ లోయ వద్ద ఉన్న సరిహద్దు ప్రాంతంలో మే నెలలో నిర్మాణాలు లేవు. కానీ సరిహద్దు రేఖ వద్ద జూన్ మూడో వారానికి నిర్మాణాలు కనిపించాయి. అంటే చైనా 33.రోజుల్లో నిర్మాణాలు చేపట్టిందని స్పష్టంగా తెలుస్తోంది. భారత భూభాగాన్ని ఆక్రమించుకునే కుట్రలో భాగంగా ఈ నిర్మాణాలు చేస్తున్నారని సమాచారం. దీనిపై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.