Begin typing your search above and press return to search.

జనవరి 27న విడుదల కానున్న శశికళ .. !

By:  Tupaki Desk   |   18 Dec 2020 10:47 AM IST
జనవరి 27న విడుదల కానున్న శశికళ .. !
X
అక్రమ ఆస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటూ బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ విడుదల కానున్నారు. సుప్రీంకోర్టు విధించిన రూ.10 కోట్ల జరిమానాను శశికళ స్నేహితులు ప్రత్యేక కోర్టులో ఇటీవల డిపాజిట్‌ చేసారని తెలుస్తోంది. ఈ మొత్తానికి సంబంధించిన అధికారిక పత్రాలు ప్రత్యేక కోర్టుకు సమర్పించినట్టు సమాచారం. 43 నెలల జైలుశిక్షను పూర్తి చేసుకున్న శశికళకు జరిమానా చెల్లించే పక్షంలో 135 రోజుల మినహాయింపు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనితో వచ్చేఏడాది జనవరి 27న శశికళ బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి చిన్నమ్మ విడుదల ఖాయమే అని తెలుస్తుంది.

విచారణ ఖైదీగా శశికళ గడిపిన జైల్లో గడిపిన రోజులను పరిగణనలోకి తీసుకుని వచ్చే ఏడాది జనవరి 27వ తేదీ రాత్రి 7 లేదా 9.30 గంటలకు శశికళ విడుదల ఖాయమని సమాచారం. టీటీవీ దినకరన్‌ నేతృత్వంలోని అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగంకు చెందిన కార్యకర్తలు భారీ సంఖ్యలో బెంగళూరు జైలు వద్దకు చేరుకుని శశికళ ఘనస్వాగతం పలికే అవకాశం ఉందని కర్ణాటక ప్రభుత్వం అంచనా వేసింది. బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి తమిళనాడు సరిహద్దుకు ఆమె చేరే వరకు ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్‌శాఖకు కర్ణాటక ప్రభుత్వం ఒక సర్క్యులర్‌ జారీచేసింది.

కాగా, 2017 ఫిబ్రవరిలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను దోషిగా తేలుస్తూ సుప్రీం కోర్టు శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శశికళ బెంగుళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో ఆమె శిక్ష అనుభవిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 వరకూ ఆమె జైలుశిక్ష అనుభవించాల్సి ఉన్నప్పటికీ సత్ప్రవర్తన తదితర కారణాల వల్లే జనవరి 27న ఆమెను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. విడుదల సమయంలో చేపట్టాల్సిన బందోబస్తు చర్యలపై కర్ణాటక ప్రభుత్వం గురువారం జారీ చేసిన సర్క్యులర్‌ చిన్నమ్మ విడుదల విషయాన్ని అనధికారికంగా ధ్రువీకరించింది.