Begin typing your search above and press return to search.
జైలు దగ్గర చిన్నమ్మ బ్యాచ్ కోపం కట్టలు తెగింది
By: Tupaki Desk | 15 Feb 2017 7:13 PM ISTఅక్రమాస్తుల కేసులో దోషిగా నిరూపితమై.. నాలుగేళ్ల జైలుశిక్షను అనుభవించటం కోసం శశికళ జైలుకు బయలుదేరిన సంగతి తెలిసిందే. చెన్నై నుంచి బెంగళూరుకు రోడ్డు మార్గంలో బయలుదేరిన ఆమె.. ఈరోజు సాయంత్రానికి చేరుకున్నారు. భారీ కాన్వాయ్ తో.. అమ్మ ఉపయోగించిన కార్లలో వెళ్లిన ఆమె.. పరప్పణ అగ్రహార జైలు వద్దకు చేరుకున్నారు. జైలులోనే ప్రత్యేకకోర్టును ఏర్పాటు చేశారు. కోర్టుఎదుట లొంగిపోయేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.
జైలు వద్దకు రావటానికిముందే చిన్నమ్మ అభిమానులు.. సానుభూతిపరులతో జైలు పరిసరాలు నిండిపోయాయి. ముందస్తు జాగ్రత్తల కోసం గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కారు దిగిన చిన్నమ్మ.. జైల్లోకి వెళ్లిన అనంతరం ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అప్పటివరకూ తీవ్రఆగ్రహంతో ఉన్న చిన్నమ్మ వర్గం.. ఒక్కసారిగా రెచ్చిపోయారు.
కనిపించిన వాహనాలపై తమ ప్రతాపాన్ని చూపారు. కర్రలతో.. చెప్పులతో.. చేతికి చిక్కిన వస్తువులతో వాహనాల మీద విరుచుకుపడ్డారు. మరీ.. ముఖ్యంగా తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాల్ని వారు విడిచిపెట్టలేదు. హెల్మెట్లు ధరించినపలువురు.. వాహనాల మీద దాడి చేయటంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
ఊహించని విధంగా చోటు చేసుకున్న ఈ ఘటన నుంచి తేరుకున్న పోలీసులు.. వాహనాల మీద దాడులు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. మరోవైపు.. ఈ దాడులతో జైలు పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. ఈ దాడులన్నీ పన్నీర్ సెల్వం వర్గం చేయిస్తుందని శశివర్గీయులు ఆరోపిస్తుండటం గమనార్హం. ఇదిలా ఉండగా.. వాహనాల మీద దాడికి పాల్పడిన వారిలోకొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/