Begin typing your search above and press return to search.

మరో బాంబు పేల్చిన పన్నీర్..వేటు వేసిన చిన్నమ్మ

By:  Tupaki Desk   |   8 Feb 2017 6:51 PM IST
మరో బాంబు పేల్చిన పన్నీర్..వేటు వేసిన చిన్నమ్మ
X
తమిళనాడు రాజకీయాలు అంతకంతకూ పోటాపోటీగా మారుతున్నాయి. అధికార అన్నాడీఎంకేలో పన్నీర్.. చిన్నమ్మలు ఒకరికొకరు ధీటుగా ఎత్తులు.. పైఎత్తులు వేస్తున్నారు. తాజాగా ఒక న్యూస్ వెబ్ పోర్టల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన పన్నీర్ సంచలన విషయాల్ని వెల్లడించారు. అపోలో ఆసుపత్రిలో అమ్మను చేర్చి చికిత్స పొందుతున్న సమయంలో తనను అమ్మ వద్దకు అనుమతించే వారు కాదని.. వైద్యులు ఇచ్చిన సమాచారాన్ని కూడా సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ను మాత్రమే అందించేవారని పేర్కొనటం గమనార్హం.

అమ్మ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని.. అపోలో వైద్యులు ఇచ్చిన వివరణతో ప్రజలు సంతృప్తి చెందటం లేదని.. అందుకే ఈ విషయంపై సమగ్ర విచారణ జరిగితే తప్ప ప్రజలు ఒక నిర్థారణకు వచ్చే అవకాశం లేదంటూ బాంబు పేల్చారు. మరోవైపు.. పన్నీర్ సెల్వంపై ఇప్పటికే వేటు వేసిన చిన్నమ్మ.. తాజాగా మరో షాకిచ్చారు. పన్నీర్ కు మద్దతుగా నిలిచిన అన్నాడీఎంకే ఐటీ విభాగం కార్యదర్శి జి. రామచంద్రన్ ను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు.

ఆయన స్థానంలో వీవీఆర్ రాజ్ సత్యయాన్ ను నియమించిన చిన్నమ్మ..తనకు వ్యతిరేకంగా గళం విప్పిన వారిని వదిలిపెట్టేది లేదని..చర్యల విషయంలో రాజీ పడేది లేదన్న విషయాన్ని తాజా చర్యతో స్పష్టం చేశారని చెప్పాలి. పోటాపోటీగా పావులు కదుపుతున్న ఈ ఇరువురి మధ్య నడుస్తున్న యుద్ధం ఎక్కడి వరకూ వెళుతుందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేకెత్తిస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/