Begin typing your search above and press return to search.
చిన్నమ్మ తాజా రిక్వెస్ట్.. ముందే జైలు నుంచి విడుదల?
By: Tupaki Desk | 3 Dec 2020 10:15 AM ISTఆదాయానికి మించిన ఆస్తులున్న నేరం రుజువు కావటమే కాదు.. కొన్నేళ్లుగా జైల్లో ఉంటున్న తమిళనాడు చిన్నమ్మ కమ్ దివంగత సీఎం జయలలితకు అత్యంత సన్నిహితురాలైన శశికళ తాజాగా ప్రభుత్వానికి ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ప్రస్తుతం పరస్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆమె.. షెడ్యూల్ ప్రకారం 2021 జనవరి 27న విడుదల కానున్నారు. శిక్షలో భాగంగా కోర్టుకు రూ.10కోట్లు చెల్లించాలని చెప్పగా.. ఆ మొత్తాన్ని చెల్లించేశారు.
జైల్లోని ఖైదీలు తమ ప్రవర్తన బాగుంటే.. వారికి విధించిన శిక్షా కాలానికి ముందే విడుదల చేస్తారు.ఆ లెక్కన చూస్తే..ప్రతి నెలా మూడు రోజుల చొప్పున శిక్షా కాలాన్నిమినహాయించాల్సి ఉంటుంది. ఒకవేళ.. శశికళ విషయంలోనూ ఆ రూల్ అప్లై అయితే.. ఇప్పటికే 43 నెలలు శిక్షా కాలాన్ని అనుభవించిన ఆమె.. 135 రోజులు సత్ప్రవర్తన దినాల్ని మినహాయిస్తే.. ఈపాటికి విడుదల కావాల్సింది ఉంటుంది.
ఇదిలా ఉంటే చిన్నమ్మ జైలు జీవితంపై కర్ణాటక రాష్ట్ర మంత్రి బసవరాజ్ స్పందిస్తూ.. అవినీతి నిరూపితమై శిక్ష విధించిన తర్వాత.. మొత్తం శిక్షను అనుభవించాలే తప్పించి.. ముందుగా విడుదలకు కుదరదని చెప్పారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసుల్లో పూర్తి కాలం జైలులో ఉండాల్సిందేనని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ముందుగా చిన్నమ్మ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం తక్కువగా ఉందంటున్నారు. మరి.. దీనికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. 2017 ఫిబ్రవరి 15 నుంచి జైలు జీవితాన్ని గడుపుతున్న చిన్నమ్మ.. 2021 జనవరి 27న విడుదల కావాల్సి ఉంది. మరి.. చిన్నమ్మ పెట్టుకున్న ముందస్తు దరఖాస్తుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.