Begin typing your search above and press return to search.

స‌ర్పంచ్ అయ్యాను.. అధికారం ఏదీ..?

By:  Tupaki Desk   |   3 May 2021 3:30 AM GMT
స‌ర్పంచ్ అయ్యాను.. అధికారం ఏదీ..?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇటీవ‌లే పంచాయ‌తీ ఎన్నిక‌లు ముగిసిన సంగ‌తి తెలిసిందే. విజేత‌లంతా సంబ‌రాలు చేసుకున్నారు. ఆనందంలో మునిగితేలారు. అధికారుల సమ‌క్షంలో గ్రామ ప్ర‌థ‌మ పౌరుడిగా బాధ్య‌త‌లు తీసుకున్నారు. కానీ.. అస‌లైన అధికారం చేతిలోకి రాక‌పోవ‌డంతో తాము ఏమీ చేయ‌లేక‌పోతున్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు తూర్పు గోదావ‌రి జిల్లా ప‌రిధిలోని స‌ర్పంచ్ లు.

తాము స‌ర్పంచ్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టి దాదాపు రెండు నెల‌లైంద‌ని అయిన‌ప్ప‌టికీ.. ఇంకా చెక్ ప‌వ‌ర్ అందించ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. సాధార‌ణ స‌మ‌యంలో ప‌ర్వాలేదు అనుకున్నా.. ఇప్పుడు క‌రోనా ప‌రిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని స‌ర్పంచ్ లు ఆవేద‌న చెందుతున్నారు.

గ్రామాల్లో క‌నీసం శానిటైజేష‌న్ ప‌నులు చేయాల‌ని అనుకున్నా కూడా పైసా ఖ‌ర్చు చేయ‌లేని ప‌రిస్థితిలో ఉన్నామ‌ని అంటున్నారు. ప్ర‌భుత్వం, అధికారులు వెంట‌నే స్పందించి, చెక్ ప‌వ‌ర్ అందించేలా చూడాల‌ని కోరుతున్నారు.