Begin typing your search above and press return to search.

వాట్సాప్ వ‌ల్లే స‌ర్పంచిగా ఓడాన‌ని హైకోర్టు మెట్లెక్కాడు

By:  Tupaki Desk   |   29 Jan 2019 2:48 PM GMT
వాట్సాప్ వ‌ల్లే స‌ర్పంచిగా ఓడాన‌ని హైకోర్టు మెట్లెక్కాడు
X
తెలంగాణ‌లో హోరాహోరీగా సాగుతున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో తెర‌మీద‌కు వ‌చ్చిన అనేక చిత్ర‌మైన అంశాల్లో ఇదొక‌టి. తుది - మూడో విడ‌త‌ పోలింగ్‌ కు స‌మీపిస్తున్న ద‌శ‌లో ఓ అభ్య‌ర్థి అనూహ్య‌మైన పిటిష‌న్‌ తో తెలంగాణ రాష్ట్ర స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు. వాట్స్ అప్ మెసేజ్ - ఫేస్‌ బుక్ లో పోస్ట్ చేసిన తప్పుడు ప్రచారాలతో తాను సర్పంచ్ గా ఓడిపోయాను అని వాపోయాడు. తనకు న్యాయం చేయాలని హైకోర్టుని ఆశ్రయించాడు. కుక్క రాంచందర్ అనే వ్య‌క్తి దాఖ‌లు చేసిన పిటిష‌న్ ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

వివ‌రాలు ఇవి...మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం నూతన గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కుక్క రాంచందర్ కథనం మేరకు... బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం నూతన గ్రామ పంచాయితీలో సర్పంచ్ ఎన్నికల్లో కుక్క రాంచందర్ పోటీలో ఉండగా ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం పలువురు వాట్స్ అప్ గ్రూప్ లో సర్పంచ్ అభ్యర్థి రాంచందర్ పై ఆరోపణలు చేస్తూ మెసేజ్ తో పాటు ఫేస్ బుక్ లో కూడా పోస్ట్ చేసారు. గెలుపు రేసులో ఉన్న నేను ఈ పోస్ట్ లతో నాపై తప్పుడు ప్రచారం జరగడం వల్ల ఓడిపోయాను అని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి ఉన్న సమయం లో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి నా ఓటమికి కారణం ఐన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు రీ ఎలక్షన్స్ నిర్వహించి తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించినట్లు కుక్క రాంచందర్ పేర్కొన్నారు. ఆయ‌న ఫిర్యాదుపై త‌దుప‌రి వాద‌న‌ల త‌ర్వాత తీర్పు వెలువ‌డ‌నుంది.